Rajamouli: రాజమౌళికి ఇష్టమైన హీరో అతనే… ఎవరంటే?

Rajamouli: బాహుబలి సినిమా ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తెలియజేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈయన సినిమా చేపట్టారు అంటే తప్పనిసరిగా ఆ సినిమా బాక్సాఫీసు వద్ద మినిమమ్ హిట్ గ్యారెంటీ అనేలా ఉంటుంది. అలా సినిమా కోసం రాజమౌళి ఎంతో తాపత్రయపడతారు.ఇకపోతే తాజాగా ఈయన హైదరాబాద్ లో జరిగిన బ్రహ్మాస్త్ర మోషన్ పోస్టర్ వేడుకలో పాల్గొన్నారు.ఈ వేడుకలో భాగంగా రాజమౌళి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ బ్రహ్మాస్త్ర సినిమా డైరెక్టర్ అయాన్ ఒక సినిమా పిచ్చోడు అని అతని పై ప్రశంసలు కురిపించారు.అలాగే ఈ సందర్భంగా తనకు ఇష్టమైన హీరోల గురించి మాట్లాడుతూ తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో రణబీర్ కపూర్ అంటే ఎంతో ఇష్టమని తన ఫేవరెట్ హీరో ఎవరో బయట పెట్టారు. రణబీర్ కపూర్ చూడటానికి ఎంతో సాదాసీదాగా ఉన్న అతనిలో ఏదో శక్తి దాగి ఉందని జక్కన్న ఈ సందర్భంగా అతని పై ప్రశంసలు కురిపించారు. అతని కళ్లలో ఇంటెన్సిటీ కనబడుతదని రాజమౌళీ అన్నారు. అతను పెద్దగా యాక్టింక్ చేస్తున్నట్లు కనబడడు కానీ, చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. అందుకే ఆయన నటన అంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించారు.

ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన ఆలియాభట్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా అమితాబచ్చన్, డింపుల్ కపాడియా, నాగార్జున వంటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే ఈ వేదికపై అలియా, రణబీర్ గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి వీరు కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.