Pushpa movie first day collections: పుష్ప సినిమా మొదటి రోజు కలెక్షన్ ఎన్ని కోట్లో తెలుసా?

Pushpa movie first day collections: సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గంధపుచెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత భారీ స్థాయిలో రెస్పాన్స్ కాకుండా మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా బడ్జెట్ విషయంలో సేఫ్ అవుతుందా అనే అంచనాలు కూడా పలువురిలో తలెత్తుతున్నాయి.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాస్ లుక్ లో కనిపించడంతో ఎంతో మంది అభిమానులు అల్లుఅర్జున్ లుక్ ఇష్టపడుతున్నారు.ఇందులో కొన్ని సన్నివేశాలు కాస్త సాగ దీసినప్పటికీ అల్లు అర్జున్ విషయానికి వస్తే అతని పాత్ర ప్రేక్షకుల అంచనాలను చేరుకుందని చెప్పవచ్చు. ఇక మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్లను వసూలు చేసిందని చెప్పాలి. ఇక తెలంగాణ ప్రభుత్వంలో 5 షోలతో పాటు టికెట్ల రేట్ల పెంపు కూడా ప్రభుత్వం అనుమతి తెలపడంతో సినిమా సేఫ్ జోన్ లో ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటిరోజు ఎంతవరకు కలెక్షన్లను రాబట్టింది అనే విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న ట్రేడ్ లెక్కల ప్రకారం కచ్చితంగా 35 నుంచి 40 కోట్ల మధ్య షేర్ తీసుకు వచ్చిందని తెలుస్తోంది.ఈ సినిమాకి అబోవ్ యావరేజ్ టాక్ సంపాదించుకొన్నప్పటికీ ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రను చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు తరలివస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పుష్ప సినిమా సేఫ్ జోన్ లో పడుతుందని చెప్పవచ్చు.