ఇప్పటివరకు అక్కినేని నాగార్జున ఎన్ని ఆస్తులు కూడబెట్టాడో తెలుసా?

అక్కినేని నాగార్జున టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరు. ఇతను ప్రఖ్యాత నటులైన అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని అన్నపూర్ణలకు 29 ఆగస్టు 1959లో మద్రాసు (చెన్నై) లో జన్మించారు. 1986లో విక్రమ్ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈయన ఎన్నో మైలురాళ్లు దాటి యువ సామ్రాట్ గా ఎదిగారు.

అంతే కాకుండా కొన్ని సినిమాలను స్వయంగా నిర్మించారు. నాగార్జునకు1984లో దగ్గుపాటి లక్ష్మితో వివాహం జరిగింది. నాగార్జున దగ్గుబాటి లక్ష్మికు అక్కినేని నాగచైతన్య కుమారుడు. తరువాత 1990 లో విడాకులు తీసుకున్నాక 1992లో అమలతో వివాహం జరిగింది. నాగార్జున అమలకు అక్కినేని అఖిల్ కుమారుడు.

దాదాపుగా మూడు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకొని కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా తనదైన క్రేజ్ లో దూసుకుపోతున్నారు. అంతేకాకుండా అక్కినేని నాగార్జున బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా పని చేస్తున్నాడు. కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేస్తున్నాడు.

ఇలా తనదైన శైలిలో దూసుకుపోతున్న నాగార్జున ఆస్తి దాదాపుగా 850 కోట్లు అని టాలీవుడ్ లో సమాచారం. ఈయన హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడ, అమరావతి, వైజాగ్ వంటి నగరాలలో రియల్ ఎస్టేట్ లలో భారీగా పెట్టుబడులు పెడతారని సమాచారం. హైదరాబాదులో అతను నివసించే బంగ్లా ఖరీదు దాదాపు 43 కోట్లు ఉంటుందట.

తన ఇంటి ఆవరణలో ఖరీదైన కార్లకు కొదవ ఉండదు. రేంజ్ ఓవర్ అబౌట్ 65, బీఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ 132 కోట్లు పెట్టి, ఇంకా స్పోర్ట్స్, గూడ్స్, గ్యారేజ్ విలువ కొన్ని కోట్లల్లో ఉంటుంది. అలాగే హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్ హాల్ కొన్ని ఎకరాలలో ఉన్న సంగతి తెలిసిందే, ఇంకా పబ్స్, రెస్టారెంట్స్, కమర్షియల్ కాంప్లెక్స్ లు చాలానే ఉన్నాయి. నాగార్జున అర్జున్ సజ్నాని దర్శకత్వం వహిస్తున్న అగ్ని వర్షం సినిమాలో నటిస్తున్నట్టు తాజా సమాచారం.