Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎంతోమంది కలల రాకుమారుడిగా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.ఇకపోతే మహేష్ బాబు తన తండ్రి కృష్ణ సినిమాలలో బాల నటుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో కృష్ణ విజయశాంతి కలిసి నటించిన కొడుకు దిద్దిన కాపురం సినిమాలో కృష్ణ కొడుకుగా ఈయన ఎంతో అద్భుతంగా నటించారు. ఇక చిన్నప్పుడు మహేష్ బాబు పలు సినిమాల్లో నటించడం వల్ల ఈయనకు నటి విజయశాంతితో ఎంతో మంచి అనుబంధం ఉండేది.
ఈక్రమంలోనే సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబు పాల్గొంటే మహేష్ బాబు కోసం ప్రత్యేకంగా విజయశాంతి ఎన్నో రకాల ఆహార పదార్థాలను స్వయంగా ఇంటి నుంచి తీసుకు వెళ్లి తనకు వడ్డించేది. ఇలా చిన్నప్పుడే విజయశాంతి అంటే తనకెంతో మంచి భావన ఏర్పడిందని, మహేష్ బాబు తన ఫస్ట్ లవ్ విజయశాంతి అని పలు సందర్భాలలో తెలియజేశారు. ఇలా మహేష్ బాబు బాల నటుడిగా హీరోయిన్ విజయశాంతిగా పలు సినిమాలలో నటించి మెప్పించారు.
మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చే లోగా విజయశాంతి సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే విజయశాంతి సినిమా రీ ఎంట్రీ ఇవ్వగానే మొట్టమొదటిసారిగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించారు. ఇలా వీరిద్దరి కాంబినేషన్ తిరిగి ఎన్నో సంవత్సరాలకు తెరపై కనిపించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది అని చెప్పవచ్చు.