DJ Tillu : లేటెస్ట్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ గా కనపడిన యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ హీరోయిన్స్ లో “డీజే టిల్లు” హీరోయిన్ నేహా శెట్టి కూడా ఒకామె. అయితే ఇపుడు లైమ్ లైట్ లో ఈ సినిమా సాలీడ్ సక్సెస్ తో తాను వచ్చింది కానీ.. ఈమె హీరోయిన్ గా ఎప్పుడో “మెహబూబా” అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అని చాలా మందికి తెలియకపోవచ్చు.
కానీ ఇప్పుడు డీజే టిల్లు తో మాత్రం ఒక కమెర్షియల్ సక్సెస్ ని తాను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సినిమా పట్ల మాత్రం ఈమెకి కొన్ని చేదు అనుభవాలు ట్రోల్స్ ఇబ్బందులు తప్పలేదు. అయినా వాటిని ఎదుర్కొని నిలబడి విజయాన్ని అందుకుంది.
అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది. “నేను చేసిన రాధికా రోల్ ని టిల్లు నమ్మలేదు, కానీ మీరు(ఆడియెన్స్) నమ్మారు. యాక్సెప్ట్ చేశారు. అందుకే నా ప్రేమ ఎప్పుడు మీతోనే ఉంటుంది. డీజే టిల్లు ని ఇంత పెద్ద సక్సెస్ ని చేసినందుకు అందరికీ థాంక్స్ ఇది లేకపోతే అవ్వదు.
ఈరోజు నేను మీకు ప్రామిస్ చేస్తున్నా ఇక నుంచి ప్రతి రోజు నా లైఫ్ లో ఇలా మంచి జర్నీ లా ఉంటుందని” తెలిపింది. దీనితో నెట్టింట్లో ఇది వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో హీరోగా టాలెంటెడ్ నటుడు సిద్ధూ జొన్నల గడ్డ నటించగా విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. అలాగే థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వగా సితార ఎంటర్టైన్మెంట్స్ లో చాలా కాలం తర్వాత ఒక మంచి హిట్ గా ఈ సినిమా నిలిచింది.
https://twitter.com/iamnehashetty/status/1502609763376369669?s=20&t=riDGRtwkoi-wQg5UfKAm0w