మొత్తానికి మళ్ళీ వాయిదాతో కొత్త రిలీజ్ తెచ్చుకున్న డీజే టిల్లు 2.. 

టాలీవుడ్ నుంచి స్టార్ట్ అయ్యిన సీక్వెల్స్ పర్వంలో చిన్న లేదు పెద్ద లేదు కంటెంట్ ఉంటే సీక్వెల్స్ ని స్వాగతించడంలో తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ముందుటున్నారు. కాగా అలాంటి చిన్న సినిమా పెద్ద సక్సెస్ లలో యంగ్ హీరో సిద్ధూ జొన్నల గడ్డ నటించి రచించిన చిత్రం “డీజే టిల్లు” గత 2022లో వచ్చి పెద్ద సక్సెస్ అయ్యింది.

ఇది హిట్ అవ్వడం దీనికి సీక్వెల్(టిల్లు స్క్వేర్) కూడా అనౌన్స్ చేయడంతో యూత్ లో ఈ సినిమా పట్ల మంచి క్రేజ్ స్టార్ట్ అయ్యింది. కానీ ఎందుకో ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత షూటింగ్ బాగానే జరిగింది కానీ రిలీజ్ మాత్రం అలా వాయిదా పడుతూ వస్తుంది.

ఎప్పుడో గత ఏడాదిలోనే రిలీజ్ కావాల్సిన చిత్రం ఇప్పుడు వరకు కూడా రాలేదు. అయితే ఫైనల్ గా చిత్ర యూనిట్ ఈ ఫిబ్రవరి 9కి లాక్ చేశారు అంటే అక్కడ నుంచి కూడా తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అయ్యి కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

దీనితో ఈ సినిమా రిలీజ్ ని మార్చ్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పై ఒక రొమాంటిక్ పోస్టర్ తో రిలీజ్ చేయగా పోస్టర్ వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ నిర్మాణ సంస్థ అలాగే నాగవంశీలు నిర్మాణం వహిస్తున్నారు. రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు.