‘వకీల్ సాబ్’ను మళ్లీ రిలీజ్ చేసే ప్రయత్నాల్లో డిస్ట్రిబ్యూటర్లు

Distributors willing to rerelease Vakeel Saab
Distributors willing to rerelease Vakeel Saab
లాక్ డౌన్ ఎత్తివేశాఖ తెలుగులో విడుదలైన భారీ చిత్రం పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం.  మొదటిరోజే సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.  పవన్ సినిమాలకు ఫస్ట్ డే హిట్ టాక్ వస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.  డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాల్ని చూడొచ్చు. ‘వకీల్ సాబ్’ మొదటిరోజు టాక్ విని అందరూ ఇదే అనుకున్నారు.  కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది కుదరలేదు.  సినిమా రన్ అర్థంతరంగా ఆగిపోయింది.  సినిమా విడుదలైన చాలా తక్కువ రోజులకే థియేటర్లు మూతబడ్డాయి.  కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కూడ కాలేదు. దీంతో భారీ ధరలకే హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు.  ఆ నష్టాన్ని ఇప్పుడు పూడ్చుకోవాలని చూస్తున్నారు వాళ్లు. 
 
ఏపీ, తెలంగాణల్లో ఈ నెలాఖరుకు సినిమా హాళ్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది.  అయితే సినిమా హాళ్లు తెరుచుకున్న వెంటనే చిన్న సినిమాలు వేస్తే ఆడియన్స్ వస్తారా అనేది పెద్ద క్వశ్చన్.  అలాగని 50 శాతం ఆక్యుపెన్సీలో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేసి ఎవ్వరూ రిస్క్ చేయరు.  అందుకే ఆ టైంలో ‘వకీల్ సాబ్’ను రీరిలీజ్ చేస్తే ఎంతో కొంత వర్కవుట్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్ల ఆశ. చిత్ర నిర్మాత, నైజాం పంపిణీదారు దిల్ రాజు సైతం ఇదే అనుకుంటున్నారట.  ఎడిటింగ్ టేబుల్ మీద కట్ చేసిన కొన్ని మంచి సన్నివేశాలను కూడ కలిపి రీరిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుందని భావిస్తున్నారు.  మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.