KGF chapter 2 : అక్కడ “కేజీఎఫ్ 2” భారీ ఫిగర్స్ డిమాండ్ చేస్తున్నారట.!

KGF chapter 2 : ఈ నెల నుంచి పాన్ ఇండియా సినిమాల దండయాత్ర మొదలు కానుండగా ఈ లిస్ట్ లో ఒక్కొక్కటిగా ఒకదాన్ని మించి మరో భారీ సినిమాలు లైన్ లోకి వస్తున్నాయి. అలా వచ్చే ఏప్రిల్ లో సిద్ధంగా ఉన్న భారీ పాన్ ఇండియా సినిమా అందులోని బాహుబలి 2 తర్వాత పాన్ ఇండియా ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ ఏక్షన్ సీక్వెల్ చిత్రం “కేజీఎఫ్ చాప్టర్ 2”.
కన్నడ రాకింగ్ స్టార్ యష్ బాస్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా పై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అందుకే రికార్డు స్థాయి బిజినెస్ ని కూడా ఇది నమోదు చేస్తుంది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఈ సినిమా వండర్స్ నమోదు చేస్తుంది అని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.
అయితే ఈ హిందీలో ఎవరైతే సినిమా హక్కులు కొనుగోలు చేశారో వారే ఈ భారీ సినిమాని ఓవర్సీస్ లో కూడా రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా టాక్ బయటకు వచ్చింది. అయితే అక్కడి హక్కులకు గాను వీరు ఎగ్జిబిటర్స్ కి రికార్డ్ ధరలు చెబుతున్నారట. అన్ని భాషలలో వీరే రిలీజ్ చేస్తుండగా అందుకు గాను భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారట.
అయితే ఈ సినిమాపై క్రేజ్ కూడా ఆ స్థాయిలోనే ఉంది కాబట్టి ఎంత పెట్టి కొన్నా ఆడియెన్స్ తిరిగి ఇచ్చేస్తారు. మరి ఈ సినిమా ఓవర్సీస్ డీల్ పై ఒక తుది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ నటించగా ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే రవి బాసృర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే పిక్చర్స్ పతాకంపై నిర్మాణం వహించారు. అలాగే ఈ బిగ్గెస్ట్ ఏక్షన్ థ్రిల్లర్ చిత్రం ఈ ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.