రాజకీయ పార్టీల మధ్య, రాజకీయ నాయకుల మధ్య సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉండటం అనేది ఒక్కప్పటి మాట. ఇప్పుడు పార్టీలకు, ఆ పార్టీలలో ఉండే నాయకులు అస్సలు సిద్ధాంతాలే ఉండటం లేదు, సిద్ధాంతాలతో రాజకీయాలు చెయ్యడం చేతకాని రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా దూషిస్తూ రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు ఎంతలా దిగజారిపోయారంటే ఒకరు లావుగా ఉన్నారంటే ఇంకొకరు నువ్వు పొట్టిగా ఉన్నవాని, నువ్వు నల్లగా ఉన్నావని ఒకరంటే నీకు బట్టతల ఉందని బాడీ షేమింగ్ చేసుకునే నీచ స్థాయికి దిగజారి పోయారు. బాడీ షేమింగ్ చెయ్యడం తప్పని చెప్పాల్సిన నాయకులే ఇలా సిగ్గు లేకుండ( సారి, ఈ నాయకులకు అసలు బుద్ధే లేదు సిగ్గేలా ఉంటుంది) మాట్లాడుతూ రాజకీయాల విలువలను మంటా కలుపుతున్నారు. అలాగే ఇప్పుడు ఏపీలో జబ్బుల రాజకీయాలు కూడా మొదలయ్యాయి.
చంద్రబాబు జబ్బు ఏంటో తెలుసా!
సిద్ధాంతాల పరంగా రాజకీయాలు చెయ్యడం చేతకాని వైసీపీ, టీడీపీ నాయకులు ఇప్పుడు జబ్బుల పేరుతూ రాజకీయాలు చేస్తున్నారు. జగన్ కు ఆ జబ్బు ఉందని టీడీపీ నేతలు అంటుంటే, చంద్రబాబుకు ఈ జబ్బు ఉందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఏపీని ముమ్మారు ఏలిన చంద్రబాబుని విమర్శించడమంటే వ్యక్తిగతంగా తగులుకుంటారు వైసీపీ నేతలు, మంత్రులు. బాబుకు బొల్లి ఉందంటారు, ఆయన ఇపుడు అల్జీమర్స్ అంటే మతిమరుపు జబ్బుతో బాధపడుతున్నారని కూడా తరచూ అనేది వైసీపీ నేతలే. అంతకు ముందు ఇదే విమర్శను కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు వంటి నాయకులు కూడా బాబు మీద చేసేవారు.
జగన్ కు ఉన్న జబ్బు ఏంటో తెలుసా!
వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడుకు జబ్బులు అంటకడితే టీడీపీ నేతలు ఊరుకుంటారా ! వాళ్ళు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పలు రకాల వ్యాధులను అంటకడుతున్నారు. జగన్ ని సైకో అంటూ టీడీపీ నేతలు కొత్త జబ్బు అంటించారు. జగన్ శాడిస్ట్ అని కూడా అన్నారు. ఇక ఆయన ప్రత్యర్ధులను ద్వేషించే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని కూడా అంటున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యలు అభ్యసించిన నారా లోకేష్ కూడా సిగ్గు లేకుండా ఈ జబ్బుల రాజకీయం మొదలెట్టారు. జగన్ యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే కొత్త జబ్బుతో బాధపడుతున్నారని తెలిపారు.