ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ స్టామినా ఇంతేనా.?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) నుంచి లేటెస్ట్ గా వచ్చిన మాస్ సాంగ్ ‘నాటు నాటు’ అదిరే రెస్పాన్స్ ని అందుకుంది. అన్ని భాషల్లో కూడా ఈ సాంగ్ టాప్ ట్రెండింగ్ లో కంటిన్యూ అవుతూ వస్తుంది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న ఫాలోయింగ్ కోసం తెలిసిందే.

కానీ రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ కి ఈ సెకండ్ సింగిల్ కి వచ్చిన రెస్పాన్స్ లు షాకిచ్చేలా ఉన్నాయని చెప్పాలి. ఇద్దరు హీరోలు అభిమానులు కలిసినా ఆల్ టైం రికార్డ్ లు సెట్ చేయకపోవడం గమనార్హం. కానీ పైగా ఈ సాంగ్ కి రెండు ఛానెల్స్ లో వచ్చిన రెస్పాన్స్ కలిపి ఆల్ టైం రికార్డ్ అంటూ ప్రచారం చేసుకోవడం కొంతమందికి నవ్వు తెప్పిస్తోందట.

ఇద్దరు మాస్ హీరోల అభిమానులు పైగా భారీ పాన్ ఇండియా సినిమా అయినా కూడా వ్యూస్, లైక్స్ పరంగా ఇలా చెప్పుకోవడం కాస్త ఎబ్బెట్టే అని చెప్పాలి. అయితే ఇవి పక్కన పెడితే అసలు సిసలు విషయం బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఈ సినిమా ధాటిని అంచనా వెయ్యలేం అని డెఫినెట్ గా చెప్పొచ్చు.