Director Shankar : “RRR” సినిమాపై దర్శకుడు శంకర్ మాట..రాజమౌళికి మాత్రం ఓ రేంజ్ ఎలివేషన్.!

Director Shankar : మన ఇండియన్ సినిమా దగ్గర టాప్ మోస్ట్ దర్శకులులో ఇప్పుడు మాత్రం దర్శకుడు రాజమోళి మళ్ళీ తానే నెంబర్ 1 అని ప్రూవ్ చేసుకున్నారు. మరి అలాగే ఈ లిస్ట్ లో రాజమౌళి కన్నా ముందు ఉన్న దర్శకుడు మాత్రం శంకర్ అని చెప్పాలి. తన సినిమాలతో శంకర్ ఎప్పుడో మన ఇండియా సినిమాని ఎక్కడో పెట్టాడు.
అలాగే గ్రాఫిక్స్ విషయంలో అయితే శంకర్ చేసినప్పుడే నాకు గ్రీన్ మ్యాట్ అంటే ఏంటో కూడా తెలీదని రాజమౌళి ఒప్పుకున్నారు. అలాంటి శంకర్ కి ఇప్పుడు టైం బాలేదు. అందుకే తన కం బ్యాక్ కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
మరి ఈ మధ్యలో మరో టాప్ దర్శకుడు రాజమౌళి చేసిన భారీ సినిమా (RRR) పై తాను ఇంట్రెస్టింగ్ రివ్యూ అందించారు. రావిషింగ్, రివెటింగ్, రోబస్ట్ గా ఈ చిత్రం ఉందని అలాగే ఇద్దరు హీరోలు కూడా తమ పాత్రల్లో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో మరియు ఎమోషన్స్ తో ఆకట్టుకున్నారని..
అలాగే దర్శకుడు రాజమౌళి ఊహా శక్తి అయితే అమోఘం అని ‘మహా రాజ’మౌళి కి హ్యాట్సాఫ్ అంటూ ఓ రేంజ్ ఎలివేషన్ ని తాను అందించారు. దీనితో ఓ ఇండియాస్ టాప్ దర్శకుడిపై మరో ఇండియాస్ టాప్ దర్శకుడు ఈ రేంజ్ కామెంట్స్ చెయ్యడం అందరిలో ఒక్కసారిగా మంచి హాట్ టాపిక్ గా మారాయి.
https://twitter.com/shankarshanmugh/status/1507410281408135168?t=PPrlLZNRCryCSkb24LlJIA&s=19