Sagar K Chandra: ఆ మూడు సినిమాలు నాకు ముంచేశాయి.. దర్శకుడు షాకింగ్ కామెంట్స్..?

Sagar K Chandra: టాలీవుడ్ దర్శకుడు సాగర్ కే చంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సాగర్ కె చంద్ర తాజాగా దర్శకత్వం వహించిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అయిన సందర్భంగా దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అయ్యారే సినిమాకి దర్శకత్వం చేస్తున్నప్పుడు తనకు సినిమా తియ్యాలి అన్న ఆలోచన తప్ప ఇంకేం లేదు అని తెలిపారు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమా చేస్తున్న సమయంలో తనకు పరిచయాలు పెరిగాయని, కాస్త అవగాహన కూడా వచ్చిందని, అడుగు ఎలా ముందుకు వేయాలో తెలిసింది అని తెలిపారు.

ఆ విధంగా బీమ్లా నాయక్ సినిమా అతను మరొక మెట్టు ఎక్కించింది అని తెలిపాడు సాగర్ కె చంద్ర. అదేవిధంగా తనను ఈ మూడు సినిమాలు ముంచేశాయి అని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా తాను దర్శకత్వం వహించిన సినిమా సూపర్ హిట్ టాక్ అనుకోవడం తనకు సంతోషంగా ఉంది అని తెలిపారు. అదేవిధంగా తన తర్వాత సినిమా కూడా రీమేక్ కాకుండా డైరెక్ట్ గా సినిమాలు చేస్తాను అని తెలిపారు.