Dil Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దిల్ రాజు ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే తన నిర్మాణ సంస్థలో ఎన్నో అద్భుతమైన సినిమాలను చేసిన దిల్ రాజు త్వరలోనే నితిన్ తో కలిసి చేసిన తమ్ముడు అనే సినిమా ద్వారా రాబోతున్నారు. దిల్ రాజు కెరియర్ పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన తన మొదటి భార్య అనిత మరణించిన తరువాత రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తేజస్విని అనే అమ్మాయితో రెండో వివాహం చేసుకున్న దిల్ రాజు తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు.
ఇకపోతే ఇటీవల దిల్ రాజు భార్య తేజస్విని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె దిల్ రాజుతో పెళ్లి పరిచయం వంటి విషయాల గురించి ఎన్నో తెలియజేశారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తనకు ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయాన్ని కూడా బయట పెట్టారు. తాను చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని అని తెలిపారు. ముఖ్యంగా సినిమా సమయంలో ఆయనకు అభిమానిగా మారిపోయానని తెలిపారు.
ట్ఇక పవన్ కళ్యాణ్ గారిని మొదటిసారి తాను పెళ్లయిన తర్వాత వకీల్ సాబ్ సినిమా షూటింగ్ సమయంలో కలిశానని అనంతరం వకీల్ సాబ్ సినిమాకే మొదటిసారి వెళ్లాను అంటూ తేజస్విని గుర్తు చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి కూడా ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. మనమేదైనా ఒకటి చెప్పాము అంటే ఆయన చాలా పర్సనల్ గా తీసుకుంటారు ఆ విషయం గురించి చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఆ ధ్యాసలోకి వెళ్ళిపోతుంటారంటూ తేజస్విని పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటూ తేజస్విని చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.