Dil Raju Troubles For Acharya : ఇండస్ట్రీ టాక్ : “ఆచార్య” కి అక్కడ దిల్ రాజు అడ్డు..అసలు కథేంటో చూడండి.!

Dil Raju Troubles For Acharya :  జస్ట్ మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ దగ్గర రిలీజ్ కాబోతున్న మరో భారీ సినిమా “ఆచార్య”. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో మరో టాప్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్ మల్టీ స్టారర్ కోసం ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి మెగాస్టార్ సినిమా అంటే ఆ గ్రాండ్ రిలీజ్ వసూళ్లు అంతా ఎలా ఉంటాయో తెలిసిందే. అలాగే ఇప్పుడు ఆచార్యకి కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ రిలీజ్ కన్ఫర్మ్ అయ్యింది. కానీ అనూహ్యంగా ఈ సినిమా రిలీజ్ కి మాత్రం నిజాం ఏరియాలో దిల్ రాజు అడ్డు పడుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే దీనికి కారణం కేజీయఫ్ సినిమా అట. నిజాం లో తానే కేజీయఫ్ 2 హక్కులని కొన్నాడు అక్కడ భారీ వసూళ్ళని లాభాలను కూడా ఈ సినిమా ఇచ్చింది. అయితే ఇంకా ఇక్కడ మంచి రన్ ని ఈ సినిమా కొనసాగిస్తుండడంతో ఆచార్య కి చాలా వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇవ్వడంలో దిల్ రాజు కాస్త అడ్డు పడుతున్నాడట.
అయితే దీనికి మరో కారణం కూడా ఉందని టాక్ ఉంది. ఆచార్య సినిమా హక్కుల కోసం కూడా దిల్ రాజు గట్టిగా ప్రయత్నించినా వేరే వారికి వెళ్లిపోయాయి. దీనితో ఆ కారణంగా కూడా అడ్డుపడుతున్నాడని అంటున్నారు. మరి నిజాం లో ఆచార్య ఫస్ట్ డే వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.