Y.S.Jagan: సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా ఈయన తన ప్రయాణం మొదలుపెట్టి అనంతరం నిర్మాతగా మారి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. దిల్ రాజు సినిమా చేస్తున్నారు అంటే ఆయన జడ్జిమెంట్ చాలా పక్కాగా ఉంటుంది. అందుకే ఈయనకు హిట్ పర్సెంట్ చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి.
ఇలా ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించారు. పవన్ కళ్యాణ్ కు వెళ్లిన సమాచారం చాలా తప్పుగా వెళ్ళిందని తెలిపారు. ఆయన సినిమా విడుదల అవుతుంటే తన సినిమాలను అడ్డుకోవాలనే ప్రయత్నం ఎవరు చేయరు అలాంటి శక్తి ధైర్యం కూడా ఎవరికి లేదని తెలిపారు. కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధిని కోరుకుంటూ సినిమా వారికి చాలా సపోర్ట్ చేస్తున్నారని దిల్ రాజు తెలియజేశారు.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి సహాయం కోరాలన్న పెద్దగా భయపడాల్సిన పని లేకుండా పోయింది. ఏదో పక్కింటికి వెళ్లినట్టు ఆంధ్ర వెళ్లి అక్కడ డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి మా పనులను చేయించుకుంటున్నాము. అలాగే సినిమా టికెట్లు రేట్లు పెంచాలంటే ఒక ఫోన్ కాల్ చేసిన లేదా ఒక లెటర్ డిప్యూటీ సీఎం గారికి పంపించిన వెంటనే టికెట్ల రేట్లు పెరిగిపోతున్నాయి. ఇదంతా కూడా కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసమే చేస్తున్నారని తెలిపారు.
గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి వాతావరణం ఉండేది కాదని తెలిపారు. సినిమా టికెట్ల రేట్లు పెంచాలని ముఖ్యమంత్రి గారిని కలిసి అడగాలంటే భయపడాల్సి వచ్చేదని దిల్ రాజు తెలిపారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు అంటూ దిల్ రాజు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.