Dil Raju: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకవైపు నిర్మాతగా వరుస సినిమాలను తెరకెక్కిస్తూనే మరొకవైపు తెలంగాణ FDC చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈయన కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇతర విషయాలలో కూడా వార్తలు నిలుస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆయన చేసే సంచలన వాఖ్యలు కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉంటాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు చేసిన మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాకుండా ఆయన తీసుకున్న ఒక సంచలన నిర్ణయం గురించి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. అసలు ఏం జరిగిందంటే తాజాగా గురువారం రోజు హైదరాబాదులో మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ పాల్గొన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ఈ వేదిక నుంచి పిలుపునిచ్చారు. అలాగే ఈ కార్యక్రమానికి తెలంగాణ FDC చైర్మన్ గా దిల్ రాజు కూడా హాజరయ్యారు.
.
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఇటీవల మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇండస్ట్రీలో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే వారిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని నిర్ణయం తీసుకున్నారు. అలాగే తెలంగాణ FDC నుంచి చెప్తున్నా అలాంటిది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా జరిగితే వాళ్ళని నిర్ములిస్తే జనాల్లోకి మంచి మెసేజ్ వెళ్తుంది. FDC చైర్మన్ గా తెలుగు సినీ పరిశ్రమతో మాట్లాడి అది ఇక్కడ కూడా అమలయ్యేలా చూస్తాము అని అన్నారు దిల్ రాజు. అదే గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది వ్యక్తులు డ్రగ్స్ సంబంధిత వ్యవహారాలలో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. కొంతమందిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. అయితే ఇక మీదట ఇలాంటి తప్పులు ఎవరు చేయకూడదని, మళ్లీ డ్రగ్స్ మూలంగా అరెస్టు అయ్యే పరిస్థితి ఎవరికి రాకూడదు అన్న ఉద్దేశంతో ఇలాంటి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది.