Dil Raju: ఇకపై సినిమా ఏ ఓటీటీలో వస్తుందన్న విషయం తెలియకుండా చేస్తాం.. ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన దిల్ రాజు!

Dil Raju: ఇటీవల కాలంలో ప్రేక్షకులు థియేటర్ కి రావడమే మర్చిపోయారు. ఏవో పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు విడుదల అయితే తప్ప థియేటర్ కి రావడం లేదు. దానికి తోడు ఇటీవల పుష్ప సినిమా విడుదల సమయంలో ఒక మహిళ చనిపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ రావాలి అంటేనే వెనుకడుగు వేస్తున్నారు. అయితే ప్రేక్షకులు, జనాలు థియేటర్లకు రాకపోవడానికి ప్రధాన కారణం ఓటీటీ. సినిమా విడుదల అయినా నెల రోజుల్లో పై ఈ సినిమా ఓటీటీ లోకి వస్తుండడంతో ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం లేదు.

ఇంకా కొన్ని సినిమాలు అయితే విడుదల అయినా ఒకటి లేదా రెండు వారాల లోపే థియేటర్స్ లో దర్శనమిస్తున్నాయి. అలాగే సినిమా రిలీజయిన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుండటం, ఏ ఓటీటీ లోకి వస్తుందో థియేటర్లో ముందే వేసేయడంతో సినిమా రిలీజ్ రోజే అది ఏ ఓటీటీలోకి వస్తుందో తెలిసిపోతుంది. దీంతో నెల రోజుల్లోకి ఫలానా ఓటీటీలో వచ్చేస్తుంది కదా అని జనాలు థియేటర్స్ కి రావడం తగ్గిస్తున్నారు. అయితే తాజాగా దిల్ రాజు దీనిపై స్పందించారు. తమ్ముడు ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు నేడు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో భాగంగా ఒక రిపోర్టర్ సినిమా ఏ ఓటీటీలో వస్తుందో ముందే చెప్పేస్తున్నారు.

సినిమాతో పాటు ప్రకటించేస్తున్నారు. మళ్ళీ మీరే థియేటర్స్ కి జనాలు రావట్లేదు అంటున్నారు? కనీసం నెల రోజుల్లో ఓటీటీలోకి సినిమాని ఆపకపోయినా ఏ ఓటీటీలోకి వస్తుందో ప్రకటించడం ఆపొచ్చు కదా అని ప్రశ్నించగా.. ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. గతంలో దీనిపై అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీ సంస్థలతో మాట్లాడాము. సినిమాకు బ్యాడ్ జరుగుతుంటే ఎందుకు, సినిమాలో ఓటీటీ సంస్థ పేరు వేయకపోయినా పర్లేదు అని ఓటీటీ వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ నిర్మాతలే ఇంకా ఆపట్లేదు, వేరే నిర్మాతలు ఎందుకు వేస్తున్నారో తెలీదు. మళ్ళీ దీని గురించి నిర్మాతలతో మాట్లాడి ఓటీటీ ప్రకటన లేకుండా ఉండటానికి చూస్తాము అని తెలిపారు. మరి దిల్ రాజు నిర్మాతలతో మాట్లాడి ఓటీటీ ప్రకటన ఆపితే ఎంతో కొంత సినిమాకు మంచి జరిగినట్టే. అయితే ఇది ఓటీటీ ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే సినిమా విడుదల తర్వాత ఆ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకోవడం చాలా కష్టం. మరి ఇకమీదట అయినా ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వెళ్తారేమో చూడాలి మరి..