HomeNewsతమిళ హీరోలను దింపడమే దిల్ రాజు లక్ష్యమా ?

తమిళ హీరోలను దింపడమే దిల్ రాజు లక్ష్యమా ?

Dil Raju Importing Tamil Heros To Telugu Market
బడా నిర్మాత దిల్ రాజు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మారింది.  ఇన్నాళ్లు తెలుగులోనే పెద్ద సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన ఇకపై పాన్ ఇండియా సినిమాలే టార్గెట్ పెట్టుకున్నారు. అందుకే వరుసగా పెద్ద సినిమాలను అనౌన్స్ చేశారు.  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా, శంకర్ సారథ్యంలో రామ్ చరణ్ చిత్రం, వంశీ పైడిపల్లి-విజయ్ సినిమాలను సిద్ధం చేస్తున్నారు. ఈ మూడు పాన్ ఇండియా చిత్రాలే.  కాకపోతే విజయ్ హీరోగా ఆయన భారీ సినిమాకు శ్రీకారం చుట్టడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.  అసలు దిల్ రాజు సెట్ చేస్తున్న కాంబినేషన్లలో ఇతర భాషల ప్రముఖుల పాత్రే ఎక్కువగా ఉంటోంది.  
 
రామ్ చరణ్, ప్రభాస్ సినిమాలకి కూడ ఇతర భాషల దర్శకులే దర్శకత్వం వహిస్తున్నారు. ఇవి చాలావన్నట్టు ఆయన ఇంకొక తమిళ హీరోను తెలుగులోకి దింపుతున్నారు. అతనే సూర్య.  సూర్య తెలుగువారికి కొత్తేమీ కాదు.  ఆయన ప్రతి చిత్రం తెలుగులో డబ్ అవుతుంది.  చాలా ఏళ్లుగా సూర్య తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు.  కానీ కుదరలేదు.  ఇప్పుడు దిల్ రాజు రూపంలో ఆయన కోరిక తీరుతోంది.  బోయపాటి శ్రీను దర్శకత్వంలో సూర్య హీరోగా ఒక సినిమా సెట్ చేస్తున్నారట ఆయన.  ప్రజెంట్ బోయపాటి ‘అఖండ’ చేస్తున్నారు.  అది పూర్తికాగానే అల్లు అర్జున్ లేదా రవితేజతో సినిమా చేస్తారు.  దాని తరవాత సూర్య సినిమా ఉండే అవకాశం ఉందట.  మొత్తానికి దిల్ రాజు తమిళ హీరోలను తెలుగు మార్కెట్లోకి నేరుగా దింపుతూ కొత్త పద్ధతికి శ్రీకారం చుడుతున్నారు.  
 

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News