‘డై హార్డ్ ఫ్యాన్’ మూవీ రివ్యూ…  

చిత్రం :  ‘డై హార్డ్ ఫ్యాన్’
విడుదల తేది : 02, సెప్టెంబర్ 2022
నటీనటులు:
ప్రియాంక శర్మ, శివ ఆలపాటి,
షకలక శంకర్, రాజీవ్ కనకాల,
నొయ‌ల్ తదితరులు
టెక్నికల్ టీమ్:
దర్శకుడు : అభిరామ్ ఎం.
నిర్మాణం : శ్రీహాన్ సినీ క్రియేషన్స్
నిర్మాత :  చంద్రప్రియ సుబుద్ది
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సందీప్ కింతలి
మాటలు : సయ్యద్ తాజూద్దీన్
సంగీతం : మధు పొన్నాస్
సినిమాటోగ్రఫీ : జగదీష్ బొమ్మిశెట్టి
ఎడిట్ VFX – తిరు బి.

“డై హార్డ్ ఫ్యాన్” చిత్రం ఫ్యాన్ కి సెలబ్రిటీకి మధ్య లో జరిగే వన్ నైట్ డ్రామా!  శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, నోయ‌ల్ నటీనటులుగా అభిరామ్ ఎం. దర్శకత్వంలో చంద్రప్రియ సుబుద్ధి ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఈ చిత్రంలో హీరోయిన్‌ కి డైహ‌ర్ట్ ఫ్యాన్ గా శివ ఆల‌పాటి న‌టించారు. మధు పొన్నాస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సయ్యద్ తాజుద్దీన్ మాటలు రాశారు. ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు  ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.   మరి ఈ రోజు సెప్టెంబర్ 2, 2022న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో  తెలుసుకోవాలంటే… రివ్యూలోకి వెళ్లాల్సిందే..

కథ :

సినిమాల్లో న‌టించే గ్లామర్ భామలకు యూత్ లో ఎంత క్రేజ్ వుంటుందో అంద‌రికీ  తెలుసు. అలాంటిది ఓ అభిమాని శివ (శివ ఆలపాటి) త‌ను ఎంతగానో అభిమానించే హీరోయిన్‌ (ప్రియాంక శర్మ )ను  కలుసుకోవాలనుకుంటాడు.  ఒక సెలబ్రిటీగా ఆమె ఏ ఫంక్షన్ కు వెళ్లినా..  తనూ  వెళ్ళేవాడు. అయితే  తన కలల రాణి  ప్రియాంక శర్మ  బర్త్ డే రోజు ఎంతో గ్రాండ్ గా తన ఫ్యానిజం చూపిద్దామని ఎదురుచూస్తున్న శివకు అనుకోకుండా ప్రియాంక బర్త్ డే రోజు తన పర్సనల్  అకౌంట్ నుంచి మెసేజ్ రావడంతో షాక్ కు గురవుతాడు. ఆ షాక్ లో ఉండగానే  తన కలల రాణి ప్రియాంక నేరుగా శివ ఫ్లాట్ కు వచ్చి అతడిని ఎంతో సర్ప్రైజ్ చేస్తుంది. అలా రాత్రి పూట స్టార్ హీరోయిన్ ప్రియాంక శర్మ డై హార్డ్ ఫ్యాన్ శివ ఇంటికి  రావడానికి  కారణమేంటి?, తను  రావడం వలన ఆ రాత్రి వారి మధ్య ఏం జరిగింది?. ఆ రాత్రి జరిగిన  సంఘటన నుండి శివ ఎలా బయట పడ్డాడు? అనేది తెలుసు కోవాలంటే థియేటర్ కు వెళ్లి  సినిమా చూడాల్సిందే?

ఎవరెలా చేశారంటే..

హిరోయిన్ ప్రియాంక శర్మ సెలబ్రిటీ క్యారెక్టర్ లో ఒదిగిపోయింది.  తన నటన.. హవా బావాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రతీ సన్నివేశంలోనూ  అందర్నీ మెప్పించింది.  డై హార్డ్ ఫ్యాన్ గా శివ ఆలపాటి చాలా ఈజీగా నటించి ఆకట్టుకున్నాడు. అప్ కమింగ్ పొలిటిషియన్ పాత్రలో బేబమ్మగా నటించిన షకలక శంకర్ కామెడీ ఈ చిత్రానికి  హైలెట్ గా నిలీచింది. లాయర్ కృష్ణ కాంత్ పాత్రలో రాజీవ్ కనకాల డైనమిక్ లాయర్ గా, ఆదిత్య పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా నొయ‌ల్ చాలా చక్కగా నటించారు అనడం కంటే ఆయాపాత్రలకు జీవం పోశారు అనొచ్చు. ఇలాంటి పాత్రలు వారికి కొట్టినపిండే అన్నట్టు ఇరగదీశారు.  ఇంకా కేశవ్ దీపక్, రవి వర్మ,ఆలపాటి లక్ష్మి, అప్పారావు ఇలా అందరూ వారికిచ్చిన  పాత్రలకు పూర్తి న్యాయం చేసి ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుమున్నారు.

సాంకేతిక నిపుణుల పని తీరు :

ఇప్పుడు వస్తున్న సినిమాలకు డిఫరెంట్ గా ప్రాపర్ కంటెంట్ తో కామెడీ ఎంటర్టైనింగ్ పర్ఫెక్ట్ ఉండేలా  చూసుకుంటూ  సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ప్రతి పది నిమిషాలకు ఒకసారి ట్విస్ట్ & టర్న్స్ తో సర్ప్రైజ్ చేస్తూ  అన్ని పాత్ర‌లు హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ ఫుల్ ఫన్ ఎలిమెంట్స్ ను కొత్త కాన్సెప్ట్ తో  చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు.  హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా గా చాలా చక్కగా పండించాడు.   దర్శకుడు అభిరామ్ ఎం. కథ, కథనం, సంభాషణలు, గీత రచన ఇవన్నీ చక్కగా కుదిరేలా బాగా రాసుకున్నాడు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. సుకుమార్ దగ్గర పని చేసిన మధు పొన్నాస్ చక్కటి మ్యూజిక్ ఇచ్చారు.  పరుగే పరుగు పాట చాలా బాగుంది. జగదీష్ బొమ్మిశెట్టి  సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. తిరు చేసిన ఎడిటింగ్, వి. యఫ్. ఎక్స్ ఎంతో బాగున్నాయి. డైలాగ్స్, సయ్యద్ చేసిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ చక్కగా కుదిరాయి. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన నిర్మాత చంద్రప్రియ సుబుద్ధి ,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ కింతలి ఖర్చుకు వెనకాడకుండా, ఎక్కడా రాజీ పడకుండా  ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే విధంగా ఈ సినిమా ఉంది.. “డై హార్డ్ ఫ్యాన్” సినిమాను నమ్మి వెళ్లిన ప్రతి ప్రేక్షకుడికి సినిమా చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనే క్యూరియాసిటీతో పాటు థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తుంది.  చివరగా చెప్పొచ్చేదేమిటంటే.. ఈ  ‘డై హార్డ్ ఫ్యాన్’  సినిమా అందరినీ ఖచ్చితంగా వినోదంలో ముంచెత్తుతుంది. ఆద్యంతం ఆసక్తినీ కలిగిస్తుంది. హాయిగా ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లి సినిమాని ఎంజాయ్ చేయొచ్చు!!
రేటింగ్ :3/5