గజినీ సినిమాను ఏకంగా 12 మంది హీరోలు రిజెక్ట్ చేశారని మీకు తెలుసా?

మురగదాస్ దర్శకత్వంలో సూర్య, ఆసిన్ నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం గజినీ. ఈ పేరు వింటేనే ఆ సినిమాలో సూర్య నటన ఆయన వేషధారణ ఇట్టే కళ్లకు కనపడుతుంది. ఈ ఒక్క సినిమాతో సూర్య కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.కేవలం 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల వరకు కలెక్షన్లను సాధించి అద్భుతమైన రికార్డులను సృష్టించింది.ఇలా మురగదాస్ దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా వివిధ భాషలలో మంచి విజయాన్ని అందుకుందని చెప్పాలి.

ఇకపోతే మురుగుదాస్ 2002వ సంవత్సరంలో ఈ సినిమా కథను సిద్ధం చేసుకుని ఎంతోమంది దర్శక నిర్మాతలు చుట్టూ హీరోల చుట్టూ తిరిగారు.ముందుగా ఈయన ఈ కథ సిద్ధం చేసుకుని ఆయనకు ఎంతో సుపరిచితమైన ప్రొడ్యూసర్ సురేష్ బాబు వద్దకు వచ్చారు. కథ మొత్తం విన్న ఈయన చాలా అద్భుతంగా ఉందని అయితే ఇలాంటి సినిమాలో నటించడానికి ఎవరు ఆసక్తి చూపుతారని చెప్పారు. ఈ విధంగా ఈ సినిమాని మొదటగా మహేష్ బాబుతో అనుకున్నారు ఆయన కుదరదని చెప్పేసరికి వెంకటేష్ వద్దకు వెళ్ళింది. ఇక ఈ సినిమాలో గుండు గీయించుకోవడం, మతిస్థిమితం లేని వ్యక్తిగా నటించడం తన వల్ల కాదని వెంకటేష్ రిజెక్ట్ చేశారు.అల్లు అరవింద్ ను కలిసి కథ వివరించగా బాగుందని చెప్పడంతో హీరో కోసం వెతకమన్నారు పవన్ కళ్యాణ్ పేరు సూచించగానే పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా చేయనని చెప్పారు.

ఈ విధంగా ఈ సినిమా తెలుగులో వర్కౌట్ కాకపోవడంతో ఈయన తమిళ ఇండస్ట్రీకి వెళ్లి కమల్ హాసన్, విజయ్,మాధవన్ వంటి ఎంతోమంది హీరోలకు ఈ సినిమా కథ వివరించిన ఎవరు ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదు.ఇలా తన సినిమా చేయడానికి హీరో దొరకపోవడంతో మురగదాస్ ఈ సినిమా కథను పక్కకు పడేశారు.అయితే అనుకోకుండా ఈ సినిమాకి అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెంటనే ఆసిన్ హీరోయిన్ గా ఈ సినిమా చక చకా షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. షూటింగ్ జరిగిన 15 రోజులకు అజిత్ ఈ సినిమా నుంచి తప్పకున్నట్టు ప్రకటించడంతో మురగదాస్ ఎంతో కృంగిపోయారు.

ఇలా తన సినిమాకి ఎన్ని అవాంతరాలు ఏర్పడుతుండగా ఆయనలో ఎలాగైనా ఈ సినిమా తీసి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టాలని కసి పెరిగింది.ఇలా ఈ సినిమా కథను ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 12 మంది రిజెక్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ కథతో నటుడు సూర్య వద్దకు వెళ్లగా ఈ కథ విన్న సూర్య ఒక్కసారిగా లేచి నిలబడి వెంటనే మురగదాస్ ను కౌగిలించుకొని ఇలాంటి సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమా చేద్దామని అనుకున్న విధంగానే ఈ సినిమాని 92 రోజులలో పూర్తి చేసి 2005 వ సంవత్సరంలో విడుదల చేశారు.ఇలా ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఏకంగా ఈ సినిమాని రిజెక్ట్ చేసిన 12 మంది హీరోలు కూడా ఇలాంటి గొప్ప సినిమాని మిస్ అయ్యామని ఎంతో బాధపడ్డారు.ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఎంతోమంది హీరోలు రీమేక్ కోసం కథ సిద్ధం చేయమని మురగదాస్ వెంట పడటం గమనార్హం.

తన కథని రిజెక్ట్ చేసినవాళ్ళే  మళ్ళీ  తన వెంటపడేలా చేసిన మురగదాస్ Suriya Muragads Gajini Flashback