గ్రేటర్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి, ఎవరికీ ఎవరు తీసిపోని విధంగా విమర్శలు చేసుకుంటూ ఎన్నికల సమరాన్ని రక్తి కట్టిస్తున్నారు. ప్రధానంగా తెరాస బీజేపీ మధ్య జరుగుతున్నా మాటల యుద్ధం నడుస్తుంది. బండి సంజయ్ దుబ్బాకలో చూపించిన దూకుడు ఇక్కడ కూడా చూపిస్తూ ఎలాంటి అవకాశం వచ్చిన వదిలిపెట్టడం లేదు. మొన్నటికి మొన్న వరద సహాయం ఆగిపోవటానికి బండి సంజయ్ కారణమని తెరాస ఒక లెటర్ ను బయటకు విడుదల చేస్తే, దానిని భయపడకుండా దానినే తనకు అనుకూలంగా మలచుకుంటూ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ప్రమాణం చేయటానికి నేను సిద్ధమని, నాపై ఆరోపణలు చేస్తున్న సీఎం కేసీఆర్ సిద్ధమా అంటూ సవాల్ విసిరి, పాతబస్తీకి వెళ్ళివచ్చాడు దీనితో తెరాస నేతలు కంగుతిన్నారు.
ఇక ఇప్పుడు ఆ వంతు ఎంఐఎం పార్టీకి వచ్చినట్లు ఉంది. నిన్న అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ అనాలోచితంగా పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల కూల్చివేత గురించి మాట్లాడారు. దీనితో బండి సంజయ్ కి మంచి అవకాశం దొరికింది. నిజానికి పీవీ ఏమో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు, ఎన్టీఆర్ ఏమో టీడీపీ వ్యవస్థాపకుడు, అలాంటిది అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై ఆ రెండు పార్టీలు స్పందించటం కంటే ముందుగానే బండి సంజయ్ మాట్లాడుతూ నీ అయ్యా జాగీరా అనుకున్నావా..? పీవీ,, ఎన్టీఆర్ ఘాట్లను నువ్వు కూల్చిన రెండు గంటల్లోనే నీ దారుస్సలాం ను బీజేపీ కార్యకర్తలే కూల్చివేస్తారాని హెచ్చరించటమే కాకుండా ఆయా నేతలకు కాషాయ రంగు కూడా పులిమేశాడు బండి సంజయ్ ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు ధరించి పాలన చేశారని కూల్చుతారా?.. అయోధ్య అంశంపై పీవీ స్ఫూర్తిదాయక పాత్ర పోషించారని కూల్చుతారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
పీవీ, ఎన్టీఆర్ ఘాట్లకు నివాళులర్పిస్తానని.. మహానాయకుల ఘాట్లకు రక్షణగా ఉంటానని ప్రమాణం చేయబోతున్నారు. అటు టీడీపీ ఫ్యాన్స్‌ని ఇటు పీవీకి మద్దతుగా ఉండే కాంగ్రెస్ ఫ్యాన్స్‌ని బండి సంజయ్ ఏక కాలంలో ఆకట్టుకుంటున్నారు. బండి సంజయ్ తీరుతో తెరాస మరియు ఎంఐఎం పార్టీలు షాక్ అయ్యాయనే చెప్పాలి. అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ఈ విధంగా బండి సంజయ్ తమకు అనుకూలంగా మలుచుకుంటాడని కనీసం వాళ్ళు ఆలోచన కూడా లేకపోయారు. పైగా ప్రగతి భవన్ లో రాసిన స్క్రిప్ట్ ను ఎంఐఎం నేతలు చదువుతున్నారంటూ ఆ రెండు పార్టీల జుట్లు ముడివేసి ప్రయత్నం కూడా చేశాడు బండి సంజయ్. మరి ఆయన అనుసరిస్తున్న వ్యూహాలతో ప్రస్తుతానికైతే ప్రత్యర్థి పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న మాట వాస్తవం, మరి ఈ వ్యూహాలు ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను తెచ్చి పెడుతుందో చూడాలి