Mahesh Babu: సాధారణంగా ఒక హీరో సినిమాలో నటించే ముందు ఆ కథ పూర్తిగా విని ఆ కథ తనకు సెట్ అవుతుంది అనుకుంటే చేస్తాడు. అలాగే కేవలం తనకు మాత్రమే కాకుండా ప్రేక్షకుల అభిరుచులను మనసులో పెట్టుకొని సినిమాలో నటిస్తారు. ఏ ఒక్క హీరో కూడా సినిమా ఫ్లాప్ అవుతుంది అంటే ఆ సినిమా చేయడానికి ముందుకు రారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసినా కూడా ఆ సినిమాలో నటించారు. ఆయన అనుకున్న విధంగానే ఆ సినిమా మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏమిటి అనే విషయానికి వస్తే…
మహేష్ బాబు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బాక్సాఫీస్ వద్ద ఎంత అద్భుతమైన విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబుకు మంచి క్రేజ్ తీసుకువచ్చింది. ఇలా మంచి ఫ్యామిలీ కథతో ప్రేక్షకులకు మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా తర్వాత మరొక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో మహేష్ బాబు దగ్గరకు వెళ్లారు.డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఇలాంటి ఫ్యామిలీ కథ అని చెప్పగానే మహేష్ బాబు అతని పై ఉన్న నమ్మకంతో కథ కూడా వినకుండా సినిమాకి ఓకే చెప్పారు.
ఇలా సగం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కథలో తేడా రావడంతో మహేష్ బాబు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలని పిలిచి కథ చెప్పమని అడిగారట. కథ విన్న మహేష్ బాబు డైరెక్టర్ పై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారని సినీ ఇండస్ట్రీ టాక్. ఇక కథ మొత్తం విన్న తర్వాత ఈ సినిమా తప్పకుండా ఫ్లాప్ అవుతుందని మహేష్ బాబు ముందుగానే ఊహించారట. అయితే అప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో చేసేదేమిలేక మిగతా సినిమా షూటింగ్ చేసి ఈ సినిమాను విడుదల చేయడంతో మొదటిరోజే మహేష్ బాబు ఊహించిన విధంగా నెగిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా తరువాత మహేష్ బాబు కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్.