ఆంధ్రప్రదేశ్ లో అధికారిక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్ని కరోనా వైరస్ టార్గెట్ చేసిందా? ఆ పార్టీ ఎమ్మెల్యేలపై కరోనా కక్ష గట్టిందా? అంటే అవుననే అనాల్సిన పరిస్థితి. ఇటీవలి కాలంలో వరుసగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్నారు. లక్షణాలతో కరోనా పరీక్షలు చేయించుకున్న వారందరికీ పాజిటివ్ గా నిర్ధారణ అవుతుంది. గడిచిన రెండు రోజుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు వరుసగా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక పాత జాబితోలికి వెళ్తే పెద్ద లిస్టే వస్తుంది. తాజాగా మూడవ రోజైన ఆదివారం కూడా అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది. తెనాలి నియోజక వర్గం ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ కరోనాకి సోకినట్లు నిర్దారణ అయింది.
దీంతో ఆయన హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని..ఇబ్బందికర పరిస్థితులేవి రాలేదని తెలిపారు. అలాగే ఆయనతో పాటు సన్నిహితంగా మెలిగిన వారందర్నీ కరోనా పరీక్షలు చేయంచుకోవాల్సిందిగా సూచించారు. అయితే కరోనా లక్షణాలు కనిపండచంతో ఇప్పటికే శివకుమార్ రెండు సార్లు కొవిడ్ పరీక్షలు చేసుకోగా రెండుసార్లు నెగిటవ్ వచ్చింది. మళ్లీ జలుబు, దగ్గు, జ్వరం రావడంతో మరోసారి పరీక్షలు చేయించుకోగా ఈసారి మాత్రం పాజిటివ్ వచ్చినట్ల అధికారులు తెలిపారు. ప్రజా ప్రతినిధుల్లో ఏపీలో తొలి కరోనా కేసు ఎస్ కోట వైకాపా ఎమ్మెల్యేకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అదే పార్టీ ఎమ్మెల్యేలకు వరుసగా కరోనా సోకింది. ఇందులో మంత్రులు పేర్లు కూడా వినిపించాయి.
సీఎం క్యాప్ కార్యాలయం, సచివాలయం ఇలా ప్రతీ కార్యాలయాన్ని కరోనా చుట్టేసింది. ఎమ్మెల్యే కారు డ్రైవర్లు, రక్షణ సిబ్బంది సైతం కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పలువురు ప్రభుత్వ అధికారులు కూడా వైరస్ బారిన పడ్డారు. గడిచిన రెండు రోజులోగా ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తే బెంబేలెత్తిపోవాల్సిన పరిస్థితే. మరణాల సంఖ్య కూడా అలాగే ఉంది. వచ్చే రెండు నెలల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా! మహమ్మారి మాత్రం జనాల్ని వదిలిపెట్టడం లేదు.