SSMB 29: జక్కన్న ఆఫర్‌ ను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ నటుడు.. ఏకంగా అన్ని రూ. కోట్లు ఇస్తామన్న ఒప్పుకోలేదట.. ఎవరో తెలుసా?

SSMB 29: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. అంతేకాకుండా ఆయన కెరియర్ లో వచ్చిన సినిమాలలో ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు అంటే ఆశ్చర్యం వేగమానదు. రాజమౌళి నటించాలని హీరో హీరోయిన్లు సైతం తపిస్తూ ఉంటారు. అలాంటిది ఒక బాలీవుడ్ నటుడు మాత్రం రాజమౌళి ఆఫర్ కు నో చెప్పాడట. కోట్లలో పారితోషికం ఇస్తాము అన్న కూడా అందుకు ఆయన ఒప్పుకోలేదట.

ఆ నటుడు ఎవరు? ఆయన ఎందుకు వద్దన్నారు అన్న వివరాల్లోకి వెళితే.. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి. ఈ సినిమా సంచలన విజయాలను నమోదు చేస్తుందని అభిమానులు సైతం భావిస్తున్నారు. దానికి తోడు రాజమౌళి ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై అంజనలు మరింత పెరిగాయి. అమెజాన్‌ అడవుల నేథ్యంలో అడ్వెంచరస్‌ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్‌ గతంలో ప్రకటించారు.

ఇలా ఎన్నో భారీ అంచనాల నడుమ ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. రాజమౌళి మహేష్ బాబు సినిమాను జెట్ స్పీడ్ తో షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమా ఆఫర్ ను ఒక బాలీవుడ్ నటుడు రిజెక్ట్ చేశాడని టాక్. అయితే ఆ నటుడు ఎవరో కాదు వర్సటైల్ యాక్టర్ నానా పటేకర్‌. అయితే పూణే వెళ్లి మరీ రాజమౌళి నానా పటేకర్‌ కు కథను వివరించారట. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలిపారట. అయితే కథ బాగున్నప్పటికీ ఆ పాత్రకు తాను న్యాయం చేయలేను అని సున్నితంగా రాజమౌళికి నో చెప్పారట నానా పటేకర్‌. అంతే కాదు భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్నా కూడా నానా పటేకర్‌ ఒప్పుకోలేదని తెలుస్తోంది. రూ. 20 కోట్ల వరకు రాజమౌళి ఆఫర్ చేశారని తెలుస్తోంది. అయినా కూడా ఆ పాత్రకు న్యాయం చేయలేనని చెప్పారట నానా పటేకర్‌. ఈ వార్తల్లో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..