ధనుష్ సినిమా మల్టీస్టారర్.. ఈ హీరో ఎవరంటే ?

Dhanush's trilingual movie will be multi starter
Dhanush's trilingual movie will be multi starter
తమిళ హీరో ధనుష్ తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే.  శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  ఇలా తమిళ హీరో తెలుగు దర్శకుడితో వర్క్ చేయడానికి రెడీ అవ్వడంతో సినిమా మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.  ఇద్దరూ నేషనల్ అవార్డ్స్ విజేతలు కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.  కొద్దిసేపటి క్రితమే ఆసియన్ సినిమాస్ గ్రూప్ నిర్మాతలు ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది.  తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది.  
 
డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాబట్టి ఏదైనా సున్నితమైన అంశాన్నే కథగా ఎంచుకుంటారు.  ఇకపోతే ఇందులో ధనుష్ ఇక్కరే నటించడం లేదట ఇంకొక హీరో కూడ నటిస్తారట.  అంటే ఇది మల్టీస్టారర్ చిత్రం.  అయితే ఆ హీరో యంగ్ హీరో కాదని మిడిల్ ఏజ్డ్ హీరో అని తెలుస్తోంది. మరి ఆ హీరో ఎవరనేది ఇంకా ప్రకటించలేదు నిర్మాతలు.  చాలామంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి.  ధనుష్ తమిళ హీరో కాబట్టి ఆ మిడిల్ ఏజ్డ్ హీరో తెలుగు భాష నుండి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  కొందరు హిందీ నటుల పేర్లు కూడ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.  మరి ఎవర్ని ఫైనల్ చేస్తారో చూడాలి.