‎Genelia: జెనీలియా కోసం స్పెషల్ సాంగ్ పాడిన దేవిశ్రీ ప్రసాద్.. హీరోయిన్ రియాక్షన్ ఇదే!

Genelia: గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జూనియర్. ఈ సినిమాతో కిరీటిరెడ్డి హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీ లీలా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రజనీ కొర్రపాటి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. కాగా జెనీలియా, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా రేపు అనగా జూలై 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఫుల్ బిజీబిజీగా ఉన్నారు.
‎ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ తాజాగా హైదరాబాదులో ఘనంగా జరిగింది. కాగా ఈ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హీరోయిన్ జెనీలియా కోసం ఒక ప్రత్యేకమైన పాట పాడి మెప్పించారు. హీరోయిన్ జెనీలియా గురించి మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి ముఖ్యంగా జెనీలియా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా బొమ్మరిల్లు. ఈ మూవీ ఆమె కెరియర్ ని కీలక మలుపు తిప్పిందని చెప్పవచ్చు.

Devi Sri Prasad Sings Apudo Ipudo Song for Genelia @ Junior Pre Release Event | Kireeti, Sreeleela

‎అయితే జెనీలియా సినిమాలలో నటించి చాలా ఏళ్లు అయ్యింది. ఇప్పుడు దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ బొమ్మరిల్లు సినిమా నుంచి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి అనే సాంగ్‌ తో జెనీలియాని మెప్పించారు. ఈ సాంగ్‌తో పాటు బొమ్మరిల్లు సినిమా కూడా జెనీలియా కెరీర్‌ లో చాలా ప్రత్యేకం. అందుకే ఆమె కూడా దేవీ పాటకు బాగా కనెక్ట్‌ అయ్యారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఆ పాట పాడడంతో జెనీలియా కూడా చాలా సంతోష పడింది. ఈ సినిమా కథ తనతో పాటు భర్త రితేష్‌దేశ్‌ముఖ్‌ కు కూడా బాగా నచ్చడంతోనే నటించానని ఆమె చెప్పారు. బొమ్మరిల్లులో హాసిని, హ్యాపీలో మధుమతి పాత్రలు ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో మెమొరబుల్‌ గా మిగిలిపోయాయని చెప్పవచ్చు. అందుకే జెనీలీయా చాలా ప్రత్యేకం అని చెప్పాలి.