పవన్ సినిమా విషయంలో దేవి చేతులు దులిపేసుకుంటాడా ?

Devi Sri Prasad

Devi Sri Prasad

పవన్ కళ్యాణ్ సినిమా అంటే సంగీత దర్శకులకు పూనకం వచ్చేస్తుంది. పాటలతో చెలరేగిపోతుంటారు. అలాంటి వారిలో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. పవన్ కోసం డిఎస్పీ చేసిన ప్రతి ఆల్బమ్ సూపర్ హిట్టైంది. ‘జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్’ అన్నీ హిట్ పాటలే. అందుకే పవన్, దేవి కాంబినేషన్ అంటే హిట్ ఖాయం అన్నట్టే అంటుంటారు అభిమానులు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయనున్న సినిమాకు కూడ దేవి శ్రీ ప్రసాదే సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఇంకా మొదలుకాలేదు. ప్రీప్రొడక్షన్ పనుల్లోనే ఉంది.

సినిమా సెట్స్ మీదకు వెళ్లాలంటే ఇంకో మూడు నెలలు పడుతుంది. అయితే దేవి శ్రీ ప్రసాద్ మాత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ చేసేస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు కంప్లీట్ చేశారట ఆయన. డిఎస్పీ స్పీడ్ చూస్తుంటే హరీష్ శంకర్ షూటింగ్ మొదలుపెట్టే లోపలే అన్ని పాటలు ముగించేసి తన పని అయిపోయిందని చేతులు దులుపుకునేలా ఉన్నారు. ఇంత వేగంగా పాటలు చేస్తున్నాడు కాబట్టి క్వాలిటీ ఉండదేమో అనుకుంటే పొరపాటే. ‘గబ్బర్ సింగ్’ ఆల్బమ్ గుర్తొచ్చేలా ఉంటాయట.