Pawan Kalyan: అసలు సిసలైన ఆట మొదలుపెట్టిన పవన్…. ఇక వారిద్దరికీ చుక్కలే?

Pawan Kalyan: సినీ నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలను తీసుకొని ఎంతో చక్కగా విధులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించారో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నిస్తూ అధికారులకు తనదైన శైలిలోనే వార్నింగ్ ఇస్తున్నారు.

సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ నాయకుడైనా అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ తప్పులను సమర్థించుకునే నాయకులను ఇదివరకే చూసాము కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నారని చెప్పాలి. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో హోమ్ శాఖ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే హోంశాఖ వాటిని అరికట్టడంలో విఫలమైందని నేను కనుక హోమ్ శాఖ తీసుకుంటే పరిస్థితులు మరోలా ఉంటాయని హెచ్చరించారు.

ఇక తిరుపతి తొక్కిసలాట ఘటనలో భాగంగా ప్రభుత్వానిదే తప్పు అని మా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగింది అంటూ అందరికీ క్షమాపణలు చెప్పేశారు. ఇటీవల పిఠాపురంలో పోలీసుల తీరుపై కూడా మండిపడ్డారు పోలీసులు సరిగా విధులు నిర్వర్తించడం లేదని అందుకే ఫిర్యాదులు నా వరకు వస్తున్నాయి అంటూ పవన్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఇలా సొంత ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులని కూడా తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదంటూ పవన్ వ్యవహరిస్తున్న తీరుపై కొందరు ప్రశంసలు కురిపించగా మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ఇలా సొంత ప్రభుత్వంపై కూడా ఘాటుగా స్పందించడానికి కారణం లేకపోలేదని ఇక్కడే ఈయన తన అసలైన రాజకీయం మొదలుపెట్టారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు టీడీపీనీ, అటు వైసీపీనీ ఒకే సమయంలో ఇద్దరిని తెలివిగా రాజకీయంగా నిలువరిస్తున్నారనేది కొందరి మాట.తన తాజా రాజకీయ వ్యూహంతో ఇటు టీడీపీనీ కంట్రోల్ పెట్టుకోవడంతో పాటు అటు వైసీపీనీ ప్రశ్నించకుండా అడ్డుకట్టవేస్తున్నారని చెప్పాలి. మొత్తానికి రాజకీయాల పరంగా పవన్ ఆలోచన విధానం ఇటు టీడీపీ, అటు వైసీపీ కూడా తెగ టెన్షన్ పడుతుందట. రాజకీయంగా పవన్ చాలా రాటుదేరాని జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.