Nagababu: నాగబాబుకు కీలక బాధ్యతలు… జనంలోకి రానున్న జనసేన… పవన్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Nagababu: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారంలో ఉన్నాయి ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇదే తరహా పథకం వేసినట్టు తెలుస్తుంది.

దాదాపు పది సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు పార్టీ కోసం ఎంతో కష్టపడినా ఒక్కసారి కూడా ఆయన ఎమ్మెల్యే కాలేకపోయారు. ఇలా ఒంటరి పోరాటం చేస్తే తన రాజకీయ భవిష్యత్తు శూన్యం కావడంతో ఆయన ఏకంగా తెలుగుదేశం పార్టీ అలాగే బిజెపితో పొత్తు కుదుర్చుకొని ఎన్నికల బరిలోకి వచ్చారు. ఇలా గత ఎన్నికలలో పోటీ చేసిన జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలలో విజయం సాధించింది దీంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా కూడా బాధ్యతలు తీసుకున్నారు.

ఇలా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయనకు మరింత ప్రజాదరణ పెరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా తన పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకోవడం కోసం పథకాలు రచిస్తున్నారు ఇప్పటికే ఏపీ క్యాబినెట్లో జనసేనకు సంబంధించిన ఇద్దరు మంత్రులు కొనసాగుతున్నారు. మరి కొద్ది రోజులలో నాగబాబు కూడా మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా నాగబాబు మంత్రి పదవి అయిన తర్వాత పూర్తి పాత్రలను ఆయనకు అప్పగించబోతున్నారు నాగబాబు ప్రతి ఒక్క జిల్లాలో పర్యటనలు చేయడం ప్లీనరీ సమావేశాలను ఏర్పాటు చేయడం పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తూ తమ గ్రాఫ్ పెంచుకొని దిశగా కృషి చేయాలని తన అన్నయ్యకు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్ప చెప్పినట్టు తెలుస్తుంది. ఇలా పార్టీ కార్యకర్తలతో సమావేశం కావడమే కాకుండా జనసేనలోకి అందరిని ఆహ్వానిస్తూ రాష్ట్రంలో తమ బలాన్ని పెంపొందించుకొని వచ్చే ఎన్నికల నాటికి మరిన్ని స్థానాలలో పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. కేవలం జనసేన మాత్రమే కాకుండా బిజెపి అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఇదే తరహాలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారనే చెప్పాలి.