Crime News: చిన్నారిని అత్యాచారం చేశాడని బుల్డోజర్ తో ఇంటిని కూల్చేసిన అధికారులు…!

Crime News: నేరస్తుల కబుర్లతో ఉక్కుపాదం మోపుతామని ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ఆచారాన్ని అధికారులు నిజం చేసి చూపిస్తున్నారు. అధికారులు పారిపోయిన నేరస్థులను పట్టుకునేందుకు ఇంటిని కూల్ చేస్తామని చెప్పి వారి ఇంటి ముందు బుల్డోజర్ లను దింపుతున్నారు. ఇల్లు కుల్చేస్తమనటంతో నేరస్తులు వచ్చి స్వయంగా పోలీసులకు లొంగి పోతున్నారు.

మధ్యప్రదేశ్ లో 11 ఏళ్ల చిన్నారి మీద అత్యాచారం చేసిన ఒక వ్యక్తికి అధికారులు ఈ తరహాలోనే షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే…గ్వాలియర్‌కు చెందిన 65 ఏళ్ల చతుర్బుజ్ రాథోడ్ స్థానికంగా గాలి పటాల దుకాణం నిర్వహిస్తాడు. మార్చి 24 వ తేదీ మోమోస్ కోసం దుకాణానికి వెళ్లిన 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి గోడౌన్ కి తీసుకెళ్లి అక్కడ ఆమె మీద అత్యాచారం చేశాడు. తర్వాత పాప అక్కడే వదిలేసి పారిపోయాడు.

కూతురు ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు చిన్నారి కోసం చుట్టుపక్కల ప్రాంతం అంతా గాలించారు. కొంత సమయం తర్వాత చిన్నారి అక్కడి నుండి తప్పించుకుని ఇంటికి చేరుకొని జరిగిన విషయం మొత్తం తల్లిదండ్రులతో చెప్పింది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురై వ్యాపారి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అతని మీద పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడికి గ్వాలియర్‌లో 80 లక్షల రూపాయల విలువచేసే భవనం ఉందని తెలుసుకున్న అధికారులు చట్టవిరుద్ధంగా భవన నిర్మాణం చేశారని గుర్తించి ఇంటినీ కూల్చివేయడానికి అధికారులు రంగంలోకి దిగారు. ఇంటిని కూల్చివేయడానికి కుటుంబ సభ్యులు నిరసన తెలుపుతూ అడ్డు పడగా పోలీసుల సహాయంతో 75 నిమిషాలలో 80 లక్షల విలువచేసే ఇంటిని కూల్చివేశారు.