‘దాస్ కా ధమ్కీ’ ఫిబ్రవరి 17, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్.

యంగ్, ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేస్తామని నిర్మాతలు ఇది వరకే వెల్లడించారు. ఈ రోజు మేకర్స్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. దాస్ కా ధమ్కీ ఫిబ్రవరి 17, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో వెల్వెట్ కలర్ సూట్ లో చేతికర్ర పట్టుకొని విశ్వక్ సేన్ సూపర్ డాపర్ గా కనిపిస్తున్నారు.

విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ టైటిల్ రోల్ పోషించడంతో పాటు చిత్రానికి దర్శకత్వం వహించారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ల పై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇటీవల, మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ 1.0కి అద్భుతమైన స్పందన వచ్చింది.

యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడిన రోమ్-కామ్ గా రూపొందించబడిన ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య తారాగణం

తారాగణం: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి , పృథ్వీరాజ్
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: విశ్వక్ సేన్
నిర్మాత: కరాటే రాజు
బ్యానర్లు: వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్
డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ
డీవోపీ: దినేష్ కె బాబు
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటర్: అన్వర్ అలీ
ఆర్ట్ డైరెక్టర్: ఎ.రామాంజనేయులు
ఫైట్స్: టోడర్ లాజరోవ్-జుజి, దినేష్ కె బాబు, వెంకట్
పీఆర్వో: వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: పద క్యాసెట్