DARJA Movie Official Teaser Talk : సునీల్- అనసూయల యాక్షన్ వార్! ‘దర్జా’ టీజర్

DARJA Movie Official Teaser Talk

DARJA Movie Official Teaser Talk : సునీల్ తిరిగి యాక్షన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సారి ఎస్సైగా. ‘పుష్ప’ లో సునీల్ భార్యగా నెగెటివ్ పాత్రవేసిన అనసూయా భరద్వాజ్ తిరిగి నెగెటివ్ పాత్రతో ఎంట్రీ ఇస్తోంది. ఈ సారి మాఫియగా. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ‘దర్జా’ మూవీ టీజర్ ని బుధవారం ఉదయం ప్రముఖ నిర్మాత డి సురేశ్ బాబు ఆవిష్కరించారు.

బొందలకోట అనే భవనాన్ని చూపిస్తూ టీజర్ మొదలవుతుంది. ‘ఈ బండి కనక మహాలక్ష్మిది. సరుకు మీద సెయ్యి పడితే సావు సూపిస్తదీ’ అన్న అనుచరుడి హెచ్చరికతో రఫ్ అండ్ టఫ్ గెటప్ లో వున్న అనసూయ ప్రత్యక్షమవుతుంది. ‘ఎవడైనా ఈ కనకాన్ని టచ్ చేయడానికి ట్రై చేశాడో బొందల కోట బద్దలై పోద్ది’ అని ఆమె గర్జిస్తుంది.

సునీల్ యాక్షంలో కొచ్చేసి అనసూయ అనుచరుల్ని విరగదంతాడు. అనసూయ పోలీస్ స్టేషన్లోకి దూసుకు వచ్చి ఎస్సై సునీల్ మీద విరుచుకుపడుతుంది- ‘కాలినప్పుడు కుర్చీలు గట్రా వేయకూడదురా ఖాకీ’ అని.

ఇక ఇద్దరి మధ్య భీకర వార్. ‘నువ్వు చెప్పిందల్లా చేయడానికి నేను పనోడ్ని కాను, పోలీసోడ్ని’ అంటాడు సునీల్. ‘నేను చీర కట్టిన శివంగినిరా. నేను వేటాడితే ఎలా వుంటదో వీడికి తెలియాలి’ అని అనసూయ విజృంభణ.

ఇలా ఈ మూవీ పోలీస్ – మాఫియా వార్ గా అర్ధమవుతుంది. పూర్తి మాస్ ఎలిమెంట్స్ తో మాస్ కోసం తీసినట్టుంది. అనసూయ సరే, సునీల్ ని ఈ సీరియస్ యాక్షన్ పాత్రలో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

సలీం మాలిక్ అనే కొత్త దర్శకుడు ఈ మూవీ ద్వారా పరిచయమవుతున్నాడు. కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ నిర్మాణంలో శివశంకర్ పైడిపాటి నిర్మాత. టీజర్ విడుదల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. సునీల్, అనసూయ, ఆమని, అక్సాఖాన్, షమ్ము, పృథ్వీ, అరుణ్ వర్మ, షకలక శంకర్ తదితరులు తారాగణం. కెమెరా దర్శన్, సంగీతం రాప్ రాక్ షకీల్.

DARJA Movie Official Teaser | Anasuya Bharadwaj, Sunil | Saleem | 2022 Latest Telugu Movie Trailers