AP: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డి పల్లెలో పర్యటన చేసిన అనంతరం పోలీసుల తీరు గురించి మాట్లాడటం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం అలాగే హోమ్ మినిస్టర్ సైతం స్పందించిన సంగతి తెలిసిందే.
తాజాగ పురందేశ్వరి సైతం జగన్మోహన్ రెడ్డి పోలీసుల గురించి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఏ రాజకీయ నాయకుల చొరవతోనో.. ఏదో ఒక వ్యవస్థ చొరవతోనో పోలీసులు అవ్వరని.. ఎంతో కష్ట తరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులు అయితేనే ఆ అర్హత వస్తుందని అన్నారు. శాంతి భద్రతలను కాపాడే బాధ్యతను బాధ్యతను వారి భుజాలపై వేసుకున్న నాలుగవ సింహమే పోలీసులు అంటూ తెలిపారు.
పోలీసులు వారి ప్రాణాలను పెట్టి శాంతి భద్రతలని కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇలా నాలుగవ సింహంగా పరిగణించబడిన పోలీసు వ్యవస్థ గురించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను పూర్తిగా ఖండిస్తున్నానని తెలిపారు.. సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అని కూడా లేకుండా విచక్షణ కోల్పోయి జగన్ మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. అసలు రాష్ట్రంలో ఐదు వేల మంది మహిళా పోలీసులు ఉన్నారనే విషయం జగన్‌కి తెలుసా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు కేవలం ఆ మహిళలనే కాదు ఆ వ్యవస్థలో పని చేసే ప్రతి ఒకరిని కించపరచడమేనని పురందరేశ్వరి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పోలీసుల గురించి మాట్లాడిన తీరు పూర్తిగా తప్పని వెంటనే ఆయన పోలీసు వ్యవస్థకు క్షమాపణలు చెప్పాలి అంటూ ఈమె డిమాండ్ చేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.