Vijay Antony: అందుకే విజయ్ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నాను.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సురేష్ బాబు!

Vijay Antony: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు హీరో విజయ్ ఆంటోని. సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మార్గన్. ఇది కోలీవుడ్ మూవీ అయినప్పటికీ ఈ సినిమాను టాలీవుడ్ లో కూడా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా విజయ్ ఆంటోనికి భారీగా అభిమానులు ఉన్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా నేడు అనగా జూన్ 27న విడుదలైన విషయం తెలిసిందే. లియో జాన్ పాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అజయ్ ధీషన్ విలన్ గా నటించారు. మర్డర్‌ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సముద్రఖని, దీప్షిక తదితరులు కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత డి. సురేష్‌ బాబు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ..

మ్యూజిక్‌ డైరెక్టర్‌ నుంచి హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా విజయ్‌ ఆంటోనిగారి ప్రయాణాన్ని నేను చూస్తూనే ఉన్నాను. ఆయనకు సినిమాల పట్ల చాలా ప్యాషన్‌ ఉంది. నేను అలాంటివారు తీసే చిత్రాలని ఇష్టపడుతుంటాను. అందుకే మార్గన్‌ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్నాను అని సురేష్‌ బాబు అన్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే తాజాగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన లభిస్తోంది. మరి ముందు ముందు ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో చూడాలి మరి. ఇకపోతే ఈ సినిమా విడుదల సందర్భంగా మార్గన్‌ ప్రీ రిలీజ్‌ లైవ్‌ ఇంటరాగేషన్‌ అంటూ యూనిట్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌ లో విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ.. సురేష్‌బాబు గారు మా సినిమాను రిలీజ్‌ చేస్తుండటమే మా తొలి సక్సెస్‌. ఇక మార్గన్‌ సాధారణ సీరియల్‌ కిల్లర్‌ చిత్రం కాదు. కథలో చాలా లేయర్స్‌ ఉన్నాయి. ఫస్ట్‌ నుంచి లాస్ట్‌ ఫ్రేమ్‌ వరకు ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది అని అన్నారు.