CVL Narasimha Rao: రాష్ట్రంలో గత నెల రోజుల నుంచి సినిమా టికెట్లపై తీవ్రమైన చర్చ సాగుతోందని సీవీఎల్ నరసింహారావు అన్నారు. ఎంత సినిమా చూసే ఓ నలుగురికి పదిమందికి కోసమో జరుగుతున్న చర్చ తప్పితే దీని వల్ల ఎవరికి లాభం లేదని ఆయన చెప్పుకొచ్చారు టికెట్ల ధర పెరిగితే కొన్ని వాడుకుంటాడు చూసే వాడు చూస్తాడు ఇవన్నీ పక్కన పెడితే పెద్ద సినిమా అని అన్నమయ్య సినిమా అని సినీ వర్కర్లకు ఎప్పుడైనా రెగ్యులర్ గా వచ్చే డబుల్ కాల్షీట్లు ఏమైనా ఇస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.
ఇప్పటివరకు ఏ వినియోగదారుడు గానీ వినియోగదారుల ఫోర కి వెళ్లి కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవని ఆయన అన్నారు అభిమాన హీరో సినిమా వస్తుందంటే చూసి ఎంజాయ్ చేయడానికి ఎంతైనా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారని నరసింహారావు తెలిపారు దానివల్ల కామన్ మ్యాన్ కు వచ్చే నష్టం ఏమీ లేదు కదా చెప్పారు ఇదంతా అయిదారుగురు కోసం జరిగే రచ్చ మాత్రమే అని ఆయన తెలిపారు.
ఇకపోతే తెలంగాణలో ఈ విషయంపై ఎలాంటి గొడవా లేదని, కాకపోతే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, సినిమాటోగ్రఫీ మంత్రికి థాంక్స్ చెప్పుకుంటున్నామని నరసింహారావు అన్నారు. ఎందుకంటే గత మూడు, నాలుగు దశాబ్దాల నుంచి ప్రభుత్వ ప్రమేయం లేకుండానే సినిమా పరిశ్రమ నడుస్తోందని ఆయన అన్నారు. నిజం చెప్పాలంటే ఒక చట్టాన్ని కూడా ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఫాలో కావట్లేదని, ఎప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు 2005లో ఒక జీవో తీసుకువచ్చారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా చట్టానికి లోబడి మాత్రమే పని చేయాలని, అలా పని చేయడానికి మొదలుపెట్టిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి మా తెలంగాణ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఆయన అన్నారు.