క్రేజీ అప్డేట్ : “పుష్ప” సాలిడ్ ట్రైలర్ పై నోరు విప్పారు..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న భారీ సినిమా “పుష్ప పార్ట్ 1” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా నిర్విరామంగా షూటింగ్ ఇంకో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఎలా అయినా డిసెంబర్ 17కి సినిమాని రిలీజ్ చెయ్యాలని బృందం కష్టపడుతున్నారు. మరో పక్క ఈ సినిమా ట్రైలర్ కోసం అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
 
మరి దీనిపైనే సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్ కోసం అంతా ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలుసనీ, ఇప్పుడు ఆ ట్రైలర్ సాలిడ్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అలాగే సరికొత్త పోస్టర్స్ తో మరిన్ని అదిరే అనౌన్సమెంట్ లు ఉన్నాయని రెడీగా ఉండమని ఫైనల్ గా అభిమానులకి ఓ చల్లటి కబురు చేరవేశారు.