Ntr And Uppena Director : యంగ్ టైగర్ – ‘ఉప్పెన’ దర్శకుడి సినిమాపై క్రేజీ సమాచారం మీకోసం.!

Ntr And Uppena Director : టాలీవుడ్ పవర్ ఫుల్ మాస్ హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. తన సినిమాలు ఓపెనింగ్స్ వసూళ్లే తన స్టార్డం ఏంటి అనేది చెబుతాయి. మరి అలాంటి ఎన్టీఆర్ ను వెండితెరపై చూసి దాదాపు మూడున్నర ఏళ్ళు దాటేసింది. అందుకే ఇప్పుడు అంతా తాను చేసిన భారీ ప్యాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కోసం ఎదురు చూస్తున్నారు.

మరి ఈ భారీ సినిమా తర్వాత ఎన్టీఆర్ అదిరే లైనప్ ని సెట్ చేసి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా నిలిచాడు. అయితే ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ ఒక ఇద్దరు టాప్ అండ్ సెన్సేషనల్ దర్శకులు అయిన కొరటాల శివ ఇంకా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమాలు ఓకే చేసాడు.

ఇక వీరితో పాటుగా గత ఏడాది తన మొదటి సినిమా “ఉప్పెన” తో సంచలన హిట్ అందుకున్న యువ దర్శకుడు బుచ్చిబాబు సాన తో కూడా ఎన్టీఆర్ ఒక ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తాడని ఇండస్ట్రీ టాక్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాపైనే క్రేజీ బజ్ తెలుస్తుంది. ఈ సినిమాని బుచ్చిబాబు కంప్లీట్ గా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేసాడట.

ఇంకా చెప్పాలంటే విజయనగరం ప్రాంతంలో ఒక మూడు ఏరియాల్లో నడిచే కథగా ఇది ఉంటుందని వినికిడి. దీనితో ఈ సినిమా కూడా చాల సహజంగా కొత్తగా ఉంటుంది అనిపిస్తుంది. అయితే ఇంకా ఈ సినిమా పై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. కానీ సినిమా నేపథ్యం అయితే ఇదేనట.