బిగ్ అప్డేట్ : “NBK 107” కోసం టాలీవుడ్ లో మొట్టమొదటి కొత్త ప్లానింగ్.!

టాలీవుడ్ సినిమా బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. మరి బాలయ్య హీరోగా ఇపుడు యంగ్ గ్లామరస్ హీరోయిన్ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న మాస్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మరి బాలకృష్ణ కెరీర్ లో అయితే ఈ చిత్రం కోసం తెలిసిందే దర్శకుడు గోపీచంద్ మలినేని 107వ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఈ సినిమా రిలీజ్ కన్నా ముందు సినిమా టైటిల్ ఏంటి అనే అంశం బాగా ఉత్కంఠ గా మారగా దీనిపై అయితే చిత్ర యూనిట్ ఇప్పుడు బిగ్ అప్డేట్ ని అందించారు. ఈ సినిమాకి టాలీవుడ్ లో ఇప్పటివరకు ఏ సినిమాకి కూడా చెయ్యని కొత్త ప్లానింగ్ ని చేస్తున్నట్టు తెలిపారు.

ఈ అక్టోబర్ 21న రాత్రి 8 గంటల 15 నిమిషాలకి టైటిల్ ని రివీల్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే దీనికి లోగో లాంచ్ ని కొండారెడ్డి బురుజు దగ్గర గ్రాండ్ గా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇలా టైటిల్ లోగో కి కూడా లాంచ్ ఈవెంట్ పెట్టడం అనేది ఈ సినిమాకే చెల్లింది అని చెప్పాలి.

అలాగే ఇది ప్రమోషనల్ గా కూడా సినిమాపై హైప్ గట్టిగా పెంచుతుంది అని కూడా చెప్పొచ్చు. ఇక ఈ సినిమా రిలీజ్ అయితే ఈ జనవరి 12కి ప్లాన్ చేస్తుండగా దీనిపై కూడా క్లారిటీ ఆరోజే వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.