క్రేజీ : “మెగా 154” రిలీజ్ పూనకాలపై మాసివ్ అప్డేట్ ఇచ్చేసిన మేకర్స్.!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర ఘోరంగా పరాజయం పాలైన చిత్రం “ఆచార్య”. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో కొరటాల శివ తీసిన ఈ ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ ఎక్కడో మిస్ ఫైర్ అయ్యి భారీ ప్లాప్ గా నిలిచిపోయింది. ఇక ఇది కాదు నెక్స్ట్ సినిమాలతో చూసుకుందాం అని మెగా ఫ్యాన్స్ సిద్ధం అయ్యారు. 

అయితే చిరు నెక్స్ట్ చేస్తున్న చిత్రాల్లో రెండు రీమేక్ లు ఉండగా దర్శకుడు బాబీ తో ఒక స్ట్రైట్ సినిమా ఉంది. సో ఆటోమేటిక్ గా ఆ సినిమాపైనే భారీ అంచనాలు నెలకొనగా నిన్న ఎలాంటి ఉలుకు లేకపోయినా ఈరోజు మాత్రం నిర్మాణ సంస్థ మైత్రి వారు సడెన్ అప్డేట్ ఇచ్చారు. 

11 గంటలకి అలా మెగా మాస్ అప్డేట్ అంటూ ఊహించని అప్డేట్ నే అనౌన్స్ చేసారని చెప్పాలి. దీనితో ఏకంగా ఈ సినిమా రిలీజ్ టైం ని మేకర్స్ అనౌన్స్ చేసేసారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో కలుద్దాం అంటూ అనౌన్స్ చేశారు. దీనితో వచ్చే ఏడాది సంక్రాంతి మాత్రం మాములుగా ఉండదని చెప్పి తీరాలి. 

లంగరు పట్టుకున్న చిరు చేతితో మాస్ పోస్టర్ తో ఈ ఊహించని అప్డేట్ రావడంతో అయితే ఇపుడు సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అంతా కేజ్రీగా మారిపోయారు. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.