క్రేజీ ఇన్ఫో : ‘RRR’, ‘ఆచార్య’ సినిమాల రిలీజ్ డేట్స్ ఇవే.!

ఇప్పుడు టాలీవుడ్ నుంచి కొన్ని సినిమాలు ఇంకా రిలీజ్ డేట్స్ రావాల్సి ఉన్నాయి. వాటిలో కొన్ని భారీ మల్టీ స్టారర్ చిత్రాలు కూడా ఉన్నాయి. మొదటగా దర్శక ధీరుడు రాజమౌళి అలాగే చరణ్, తారక్ ల కాంబోలో తెరకెక్కించిన భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” (RRR) సినిమాపై ఓ అధికారిక క్లారిటీ వస్తుంది అనే టాక్ తో పాటుగా డేట్ ఎప్పుడు అనేది కూడా గట్టి ఇన్ఫో వినిపిస్తుంది.

మరి దీని ప్రకారం ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7కి ఫిక్స్ అయ్యిందట. అంతే కాకుండా మరో మెగా మల్టీ స్టారర్ చిత్రం మెగాస్టార్ చిరంజీవి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబోలో కొరటాల శివ తెరకెక్కించిన “ఆచార్య” ఈ ఏడాదిలో డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవ్వనున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఆల్ మోస్ట్ ఈ రెండు సినిమాలు ఈ తేదీల్లో కన్ఫర్మ్ అట. అంతే కాకుండా ఏపీ ప్రభుత్వం కూడా సినిమా టికెట్ రేట్లు విషయంపై వెనక్కి తగ్గుతుండడమే దీనికి మరో కారణం అని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం వీటిపై ఓ అధికారిక క్లారిటీ వస్తే బాగుంటుంది.