Pushpa 2 : తెలుగు సినిమా నుంచి సెల్ఫ్ మేడ్ పాన్ ఇండియా స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పాలి. అసలు రాజమౌళి లేకుండా ఫస్ట్ టైం హిందీలో 100 కోట్లు వసూళ్లు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ హిస్టరీ సెట్ చేసాడు. అయితే ఆ సినిమానే “పుష్ప” కాగా ఈ సినిమా భారీ సక్సెస్ కావడంతో ఈ సినిమా రెండో భాగంపై ఇప్పుడు ఎనలేని అంచనాలు నెలకొన్నాయి.
అయితే ముఖ్యంగా హిందీ బెల్ట్ లో భారీ అంచనాలు నెలకొనడంతో ఈ సినిమాకి ఇప్పుడు బిజినెస్ ఫిగర్స్ తో బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. మరి ఈ సినిమా రిలీజ్ కాదు కదా ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వకపోయినా కూడా నమ్మరు గాని 650 కోట్ల మేర బిజినెస్ ఆఫర్ ఈ సినిమాకి ఉన్నట్టు తెలుస్తుంది.
అయితే ఇందులో ఒక్క ఓటిటి మరియు శాటిలైట్ హక్కులే 300 కోట్లు ఉన్నాయట. దీనితో ఇక థియేట్రికల్ హక్కులు అన్ని భాషల్లో చూస్తే తెలుగులో మినిమమ్ గా వేసుకున్నా 100 కోట్లు బిజినెస్ తమిళ, కన్నడ, మలయాల్లో కలిపి ఇంకో 100 వేసుకున్నా హిందీలో వచ్చి సింపుల్ 200 నుంచి 250 కోట్లు వేసుకుకోవచ్చు.
ఈ లెక్కన పుష్ప 2 కి 650 కోట్ల బిజినెస్ టచ్ అవ్వడం గ్యారెంటీ అని ఆల్రెడీ ఆ రేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయని ఇండస్ట్రీలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇంకా ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మాణం వహించారు.