Mahesh and Rajamouli : ఇండస్ట్రీ టాక్ : మహేష్ – రాజమౌళి సినిమాలో ఈ ఊహించని స్టార్ హీరో ఉన్నాడా?

Mahesh and Rajamouli : ప్రస్తుతం టాలీవుడ్ సహా మళ్ళీ పాన్ ఇండియా వీక్షకులు క్రేజీ గా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ కాంబో ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఇండియాస్ టాప్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ల కాంబో అని చెప్పాలి. ఈ సినిమా అనౌన్సమెంట్ కాకుండానే నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎప్పుడు మొదలువుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా..
పలు ఆసక్తికర వార్తలే ఈ సినిమాపై వినిపిస్తూ వస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా ఇంకో ఊహించని గాసిప్ సినీ వర్గాల్లో బయటకి వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ తో పాటు మన టాలీవుడ్ కి చెందిన ఇంకి క్రేజీ బిగ్ స్టార్ కూడా కనిపించనున్నాడట. మరి ఈ హీరో మరెవరో కాదు నందమూరి వారి నటసింహం నందమూరి బాలకృష్ణ అట.
ఇందులో ఎంతవరకు నిజముందో గాని ఈ టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో విస్తృతంగా వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఒకవేళ ఇదే గాని నిజం అయితే రాజమౌళి మాస్ టేకింగ్ తో థియేటర్స్ టాప్ లేచిపోవడం పక్కా అని చెప్పి తీరాలి. మరి దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏమన్నా వస్తుందేమో చూడాలి.
ఆల్రెడీ ఈ సినిమాని హాలీవుడ్ లెవెల్లోనే ప్లాన్ చేస్తుండగా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ అవుతుంది. అలాగే ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ నే కథ అందిస్తుండగా త్రివిక్రమ్ తో సినిమా అనంతరం మహేష్ ఈ సినిమాని స్టార్ట్ చేయనున్నాడు.