Acharya Movie : ఇండస్ట్రీ టాక్ : “ఆచార్య” సినిమా కోసం మహేష్ బాబుని దింపుతున్నారా??

Acharya Movie :  మరికొన్ని రోజుల్లో రిలీజ్ సిద్ధం అవుతున్న క్రేజీ చిత్రాల్లో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా “ఆచార్య” కూడా ఉంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి లు హీరోలుగా నటించిన ఈ మల్టీ స్టారింగ్ సినిమా రిలీజ్ కాబోతుండగా దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
సరే ఇదిలా ఉండగా ఈ సినిమాలో చరణ్ చేసిన పాత్రకి గాను ఆ మధ్య అంటే సినిమా స్టార్టింగ్ కి ముందే చరణ్ కి బదులు సూపర్ స్టార్ మహేష్ బాబు రోల్ ఉంటుంది అని టాక్ గట్టిగా వచ్చింది. కానీ తర్వాత అది నిజం కాలేదు అని తేలిపోయింది.
దానిని చరణ్ చెయ్యగా ఇప్పుడు మహేష్ విషయంలో ఇంకో క్రేజీ సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాలో మహేష్ పాత్ర కూడా ఉంది అట కాకపోతే అది కనిపించదు కానీ వినిపిస్తుంది అట. అంటే ఈ సినిమాకి మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ ని అందించినట్టుగా సినీ వర్గాల్లో విస్తృతంగా టాక్ నడుస్తుంది.
దీనితో ఈ సినిమాపై మరింత ఆసక్తి ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాల్లో పెరిగింది. ఇంకా ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డేలు హీరోయిన్స్ గా నటించగా మణిశర్మ సంగీతం అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.