తాజాగా సీపీఎం నేత మధు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు ఒక సిద్ధాంతం లేదని విమర్శించారు. విభజన హామీలు గురించి మాట్లాడకుండా.. పవన్ పొత్తులపై మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. గతంలో పవన్ వామపక్షాలు, బీఎస్పీ తో పొత్తు పెట్టుకున్నాడని.. ఇప్పుడు బీజేపీ, టీడీపీతో పొత్తు అంటున్నాడు అని అన్నారు.
వామపక్షాలతో పొత్తు అని మాకు తెలియకుండానే ఆయన బీఎస్పీ తో పొత్తు పెట్టుకున్నాడు అంటూ విమర్శలు చేశారు. ఆయన తీరు చూస్తుంటే జనసేన కు ఒక సిద్ధాంతం అంటూ లేదని మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ గా మారుతున్నాయి.