పవన్ అభిమానులంతా ‘వకీల్ సాబ్’ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. టీజర్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ రిలీజ్ రోజున అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా కొన్ని థియేటర్లకు డ్యామేజ్ జరిగింది. ఈ హంగామా చూసిన అందరూ అవాక్కయ్యారు. పవన్ క్రేజ్ ఇంకా తగ్గలేదని ముక్కున వేలేసుకున్నారు. ఈ క్రేజ్ ను ఇలాగే రిలీజ్ వరకు కొనసాగించాలని భావించిన అభిమానులు ప్రీరిలీజ్ వేడుకను వైభవంగా జరపాలని అనుకున్నారు. నిర్మాత దిల్ రాజు సైతం ఈ వేడుకకు ఏకంగా రెండు కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారు.
కానీ ఈవెంట్ జరిగే సూచనలు కనిపించట్లేదు. తగ్గాయనుకున్న కోవిడ్ కేసులు మళ్ళీ ఎక్కువవుతున్నాయి. లాక్ డౌన్ లేకపోయినా నిబంధనలు మాత్రం కఠినంగా ఉంటాయని అంటున్నారు. అందుకే ప్రీరిలీజ్ వేడుకకు పోలీసులు అనుమతులు ఇవ్వకపోవచ్చని అంటున్నారు. ఈ సంగతి తెలిసిన అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. మూడేళ్ళ తర్వాత పవన్ సినిమా వస్తుందని ఎన్నో ప్లాన్ చేసుకుంటే ఇలా అనుమతులు ఇవ్వకపోతే ఎలా అంటున్నారు. అని జాగ్రత్తలు పాటిస్తూ వేడుక జరుపుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. మరి వారి విన్నపాన్ని పోలీస్ శాఖ ఎంతవరకు మన్నిస్తుందో చూడాలి.