శునకానికి సీమంతం చేసిన దంపతులు … కలియుగ వింత !

ఈ ప్రపంచంలోని ప్రతి మహిళ అమ్మ అనిపించుకోవడానికి ఎంతగానో తపిస్తుంది. ఇక సీమంతం సమయంలో అందరూ వచ్చి ఆ మహిళను పొగిడితే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. ఇటీవలే ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో ఓ ఇంట్లో సీమంతం జరిగింది. ఆ ఇంట్లో సందడి మొదలైంది. వారి వీధిలో అందరికీ విందు ఏర్పాట్లు చేశారు. ఇంటి ఇంటికి బొట్టు పెట్టి శ్రీమంతం కు పిలుపు చెప్పారు. అంగరంగ వైభవంగా శ్రీమంతం వేడుకలు జరిపారు.

 

ఇంతకు ఈ వేడుక ఎవ్వరికో తెలిస్తే అవ్వాక్క అవుతారు. వారు ఇంట్లో పెంపుడు జంతువు స్టెఫీ కి శ్రీమంతం. అదే నండి విశ్వాసానికి మారుపేరు శునకం. మరి అలాంటి పెంపుడు కుక్క కు వాళ్ల ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలిగా భావించి శ్రీమంతం చెయ్యడం.. మంగళ హారుతులు ఇవ్వడం ఒక గొప్ప విషయం కదా.

పూర్తి వివరాల్లోకెళితే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లోని ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న నూతక్కి నవ కుమార్,ఆశా దంపతులు ఏడాది క్రితం చిన్న కుక్క పిల్లను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. వీరికి మూగ జీవాలు అంటే ప్రాణం. అందుకే విశ్వాసానికి మారుపేరు అయిన కుక్కను ప్రాణం కంటే మక్కువగా పెంచుకుంటున్నారు. ఆ పెంపుడు జంతువుకు స్టెఫీ అని ముద్దు పేరు పెట్టారు. ఇప్పుడు ఆ స్టెఫీ కి వైభోవంగ శ్రీమంతం చేశారు. శుభకార్యానికి విచ్చేసిన ముత్తైదువులు ఆ స్టెఫీ కి మంగళ హారతులు ఇవ్వడం చాలా గొప్ప విషయం. అంతే కాదండోయ్ ఆ వీధిలో అందరికీ చక్కటి విందు బోజనాలు కూడా పెట్టారు. ఇంటి ముందు టెంట్ వేసి..చక్కటి డెకరేషన్ చేసి…సొంత ఇంట్లో ఒక ఆడ పిల్లకు ఎలా అయితే శ్రీమంతం చేశారు. ఒక ఫంక్షన్ లా…చేసి ఆ ఇంటి యజమానులు స్టెఫీ ను చూసి ఎంతో మురిసి పోయారు.