Home News య‌ష్ అక్కినేని రెండో బ‌ర్త్‌డే.. శుభాకాంక్ష‌లు తెలిపిన స‌మంత‌

య‌ష్ అక్కినేని రెండో బ‌ర్త్‌డే.. శుభాకాంక్ష‌లు తెలిపిన స‌మంత‌

అక్కినేని ఫ్యామిలీ హీరోలు నాగార్జున‌, నాగ చైత‌న్య‌, అఖిల్‌, సుమంత్, సుశాంత్ పేర్లు చెబితే అంద‌రు ఠ‌క్కున గుర్తు ప‌డ‌తారు. కాని య‌ష్ అక్కినేని అనే స‌రికి కాస్త ఆలోచిస్తున్నారు. ఈ పేరు ఎప్పుడు విన‌లేదు, స‌డెన్‌గా ఎక్క‌డ నుండి వ‌చ్చాడంటూ ఆలోచ‌న‌లు చేస్తున్నారు. మ‌రి స‌మంత ఇచ్చిన ట్విస్ట్‌కు ఆ మాత్రం ఆలోచించ‌క‌పోతే ఎలా? స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బేబి బాయ్ రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. వాడికి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు అని కామెంట్ పెట్టింది.

Sam Wish | Telugu Rajyam

స‌మంత మాట్లాడింది త‌న పెంపుడు కుక్క య‌ష్ గురించి. ఈ రోజు రెండ‌వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా య‌ష్ అంద‌మైన ఫొటో షేర్ చేస్తూ విషెస్ చెప్పింది. గ‌తంలోను య‌ష్‌కు సంబంధించి చాలా ఫొటోలు షేర్ చేసింది. దాంతో ఎల్ల‌ప్పుడు స‌ర‌దాగా గ‌డుపుతూ ఉంటుంది సామ్. ఈ రోజు య‌ష్ బ‌ర్త్‌డే కాగా, నిన్న సమంత భ‌ర్త నాగ చైత‌న్య పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా క్యూట్ క‌పుల్ మాల్దీవుల‌కి చెక్కేశారు. అక్క‌డ తెగ ఎంజాయ్ చేస్తూ అడ‌పాద‌డ‌పా ఫొటోల‌ని షేర్ చేస్తూ వ‌స్తున్నారు.

భార్య భర్తలు మాల్దీవుల్లోని ఉత్తరాదిన ఉన్న ఓ ద్వీపంలో ఉన్నట్టు తెలుస్తోంది. సమంత అక్కడ స్కూబా డైవింగ్‌ కూడా చేశారు. దానికి సంబంధించిన ఓ ఫోటోను సమంత పోస్ట్ చేసింది. వ‌ర్క్ విష‌యానికి వ‌స్తే సామ్ ప్ర‌స్తుతం ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో పాటు సామ్ జామ్ అనే షోని హోస్ట్ చేస్తుంది. ఆ త‌ర్వాత నంద‌ని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నుంది. ఈ సినిమాలో చైతూ కూడా న‌టించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇక నాగ చైత‌న్య‌.. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ స్టోరీ అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం థ్యాంక్యూ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

- Advertisement -

Related Posts

స్టన్నింగ్ డ్యాన్స్‌తో ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తున్న క‌త్రినా.. వైర‌ల్‌గా మారిన వీడియో

బాలీవుడ్ హీరోయిన్ క‌త్రినా కైప్ ఇటీవ‌ల త‌న సినిమాల‌తో అంత‌గా అల‌రించ‌క‌పోయిన‌ప్ప‌టికీ, స్ట‌న్నింగ్ ప‌ర్‌ఫార్మెన్స్‌ల‌తో అంద‌రి మ‌తులు పోగొడుతుంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఈ అమ్మ‌డు ప‌లు వీడియోలు షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌కు కావ‌ల‌సినంత...

విడాకుల తర్వాత శృంగార పాత్ర‌లకు సై అంటున్న ‘ఏస్తేర్’

సింగర్ నోయల్‌ని ప్రేమ వివాహం చేసుకున్న హీరోయిన్ 'ఏస్తేర్' పెళ్లయిన మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరి మధ్య విభేదాల కారణంగా 2019 జూన్ నెలలో విడిపోయి, 2020 సెప్టెంబర్ నెలలో విడాకులు తీసుకున్నారు....

వాట్సాప్ కు వీడ్కోలు పలుకుతున్న యూజర్లు… ప్రత్యామ్న్యాయ యాప్ ల వైపు మొగ్గు !

తాజాగా వాట్సాప్ సంస్థ తెచ్చిన కొత్త వ్యక్తిగత గోప్యతా విధానంపై మొదలైన వివాదం వలన యూజర్లు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది ప్రత్యామ్న్యాయ యాప్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనితో దాని...

Latest News