సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు కొంతకాలంగా నిరాశతో ఉన్నారు. రాజకీయాల్లోకి వస్తాను వస్తాను అని చివరకు రజినీ విరమించుకోవడంతో ఫ్యాన్స్ తీవ్రంగా హార్ట్ అయ్యారు. రాజకీయాల్లోకి రావాల్సిందేనని రజినీ మీద ఒత్తిడి పెంచారు. కానీ రజినీ మనసు మార్చుకోలేదు. దీంతో అభిమానులే సైలెంట్ అయిపోయారు. అలా నిరాశలో ఉన్న వారికి ఒక గుడ్ న్యూస్ అందింది. రజినీని ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ వరించింది.
51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఆయనను ఎంపిక చేసినట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతుంటే ఇంకొందరు మాత్రం విమర్శలు సంధిస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇలా రజనీకి అవార్డ్ రావడం ఏమిటి, ఇదంతా బీజేపీ నాయకులు రజినీ అభిమానులను తమవైపుకు తిప్పుకొనేందుకు చేస్తున్న ప్రయత్నమని అంటున్నారు. అభిమానులు అయితే రజనీకి అవార్డులు కొత్త కాదని 2000లో పద్మభూషణ్, 2006లో పద్మవిభూషణ్ లాంటి అవార్డులు వచ్చాయని, ఉద్దేశ్యపూర్వకంగానే దీన్ని రాజకీయం చేస్తున్నారని అంటున్నారు.