తెలంగాణను తామే ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఇప్పుడు తెలంగాణ ఎంత దారుణంగా ఉందొ అందరికి తెలిసిందే. ఇప్పుడు కనీసం పార్టీలో ఎవరు ఉన్నారో కూడా తెలంగాణ ప్రజలకు తెలియదు. మొన్న దుబ్బాక ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉన్నట్టు కూడా ప్రజలకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ను నడిపించే నాయకుడి కోసం కాంగ్రెస్ పెద్దలు ఎదురు చూస్తున్నారు. ఇలా పార్టీని నడిపించే నాయకుడిగా రేవంత్ రెడ్డిని నడిపించే నియమించడానికి కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్న సమయంలో కాంగ్రెస్ పెద్దలే అడ్డుపడుతున్నారు.
రేవంత్ కు అడ్డుపడుతున్న నాయకులు ఎవరు!!
రేవంత్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో పీసీసీ చీఫ్ ఇవ్వకూడదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గట్టిగా పట్టుపడుతున్నారు. ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతలు రేవంత్ రెడ్డికి ఇవ్వ వద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవి తమకు మాత్రమే ఇవ్వాలని, రేవంత్ రెడ్డికి అంత అసమర్థత లేదని పార్టీ పెద్దలు చెప్తున్నారని సమాచారం.
పార్టీని నడిపించే సమర్ధత రేవంత్ కు లేదా!!
రేవంత్ రెడ్డి ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకుంటారని, దూకుడు నిర్ణయాలతోనే ప్రజలు పార్టీ పట్ల ఆకర్షితులవుతారని, అందుకే రేవంత్ రెడ్డి లాంటి యువకుడికే పార్టీ పగ్గాలు అప్పగించాలని కొందరు కోరుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి గత ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చినా ఏమైందని వారు ప్రశ్నిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఓటమి పాలయిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే పార్టీకి ఉన్న పరువు కూడా పోతుందని అంటున్నారు. ఈ మేరకు సీనియర్ నేతలు హస్తినకు వెళ్లి రేవంత్ రెడ్డి విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా రేవంత్ రెడ్డి రాజకీయ జీవితానికి కాంగ్రెస్ నేతలే అడ్డుపడుతున్నారు. కాంగ్రెస్ లో ఉన్న అందరి నేతల కంటే కూడా రేవంత్ రెడ్డికి ప్రజల్లో ఎక్కువ మద్దతు ఉన్న విషయం తెలిసిందే. కానీ కాంగ్రెస్ నేతల ఇలా ఎందుకు అడ్డుపడుతున్నారో ఎవ్వరికి తెలియదు. వాళ్ళల్లో వాళ్లకు ఉన్న గొడవల వల్ల కాంగ్రెస్ పూర్తిగా భూస్థాపితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.