RRR : కన్ఫర్మ్ : “RRR” లో ఏ హీరో హైలైట్ అవుతాడో తెలిసిపోయింది.!

RRR : టోటల్ ఇండియన్ సినిమా దగ్గరే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల్లో దర్శకుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్ ఆలియా భట్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న భారీ ఏక్షన్ డ్రామా ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి.

అయితే ఒక పాన్ ఇండియా సినిమా రాజమౌళి సినిమా హై బడ్జెట్ ప్రాజెక్ట్ అని కాకుండా ఈ సినిమా మరింత స్పెషల్ ఎందుకు అయ్యింది అంటే ఈ సినిమా హీరోస్ వల్ల అని చెప్పాలి. ఇద్దరు పెద్ద ఫ్యామిలీ హీరోలు, అలానే మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ ఒక సినిమాలో కనిపిస్తున్నారు అంటే ఆ హై వేరే స్థాయిలో ఉంటుంది.

అందుకే ఈ సినిమా పట్ల కాస్త ప్రత్యేక వాతావరణం నెలకొంది. మరి ఎంత పెద్ద దర్శకుడు అయినా ఇద్దరినీ ఒకేలా చూపించడం కష్టం కాదు కానీ సినిమా పరంగా అయితే కేవలం ఒక హీరోకే ప్రాధాన్యత ఎక్కువ ఉండక తప్పదు. అది అనేక మల్టీ స్టారర్స్ లో ఇది వరకే చూసాం.

మరి ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ – చరణ్ లో ఎవరు బిగ్ హైలైట్ అవుతారో అనేది ఇప్పుడు తెలిసిపోయింది. ఈ చిత్రంలో అల్లూరిగా కనిపించే రామ్ చరణ్ నే హైలైట్ అవుతాడట. ఎన్టీఆర్ భీమ్ పాత్ర కూడా గట్టిదే అయినా అధిక ప్రాధాన్యత చరణ్ కే ఉంటుందని తెలుస్తుంది. ఇక్కడ కూడా చిన్న లాజిక్ ఉంది.

ఇద్దరు పాత్రల్లో చరణ్ ని అన్న పాత్ర అయితే ఎన్టీఆర్ ది తమ్ముడి పాత్ర సో ఆ రకంగా కూడా అన్నయ్య అయినటువంటి రామ్ పాత్రనే సినిమాలో హైలైట్ గా చూపిస్తారని కాకపోతే క్లైమాక్స్ కి వచ్చే నాటికి ఇద్దరు హీరోల అభిమానులకి ఈక్వల్ గానే అనిపిస్తుందని టాక్.